E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు – దూర ప్రయాణాలు వాయిదా

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు – దూర ప్రయాణాలు వాయిదా
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన మార్చి 10వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 

వృషభం

Advertisement

ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. గృహమున బంధు మిత్రుల రాకతో సందడి వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరస్థి వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లబ్ది పొందుతారు. 

మిథునం

బంధువులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఋణ ప్రయత్నాలు కలసిరావు. 

కర్కాటకం

Advertisement

దూర ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి.నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ధన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

సింహం

పాత మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన నూతన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. 

కన్య

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందవు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నూతన ఋణాలు చెయ్యకపోవడం మంచిది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్థులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం

దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటా బయట పని ఒత్తిడి పెరిగి సమయానికి తగిన విశ్రాంతి ఉండదు. ప్రభుత్వ వ్యవహారాలలో విమర్శలు ఎదురవుతాయి. 

ధనుస్సు

ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు.  

మకరం

చాలకాలంగా పూర్తి కానీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు.  దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. 

కుంభం

మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.  చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ తప్పదు.

మీనం

వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత మానసిక బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడుతాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమౌతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×