E-Paper
Advertisement

EPIC First Semester: 90స్ సీక్వెల్ ‘ఎపిక్‌’ వీడియో సాంగ్ ‘సంచారమే’.. ఎలా ఉందంటే?

EPIC First Semester: 90స్ సీక్వెల్ ‘ఎపిక్‌’ వీడియో సాంగ్ ‘సంచారమే’.. ఎలా ఉందంటే?
Advertisement

EPIC First Semester: 90స్ వెబ్ సిరీస్ సీక్వెల్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ (EPIC First Semester) సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘సంచారమే’ (Sancharame Video Song)ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సాంగ్ చిత్రంలోని ప్రధాన పాత్రల భావోద్వేగ ప్రయాణాన్ని ఎంతో అందంగా ఆవిష్కరిస్తోంది. ఇంతకు ముందు వదిలిన చిన్న ప్రోమోనే సోషల్ మీడియాలో ఎలాంటి స్పందనను రాబట్టుకుందో తెలియంది కాదు. ఇప్పుడు ఏకంగా ఫుల్ వీడియో సాంగ్‌నే మేకర్స్ వదిలారు. ఈ సాంగ్‌కు ఉన్న స్పెషల్ గురించి ఆల్రెడీ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రఖ్యాత గీత రచయిత గోరేటి వెంకన్న రచించిన ఈ పాట స్వచ్ఛమైన తెలుగు కవిత్వంతో పాటు హృదయాన్ని తాకే భావాలతో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆయన ఈ పాట రాయడమే కాకుండా, హమ్మింగ్, చివరిలో ఓ చరణం కూడా ఆలపించారు.

Also Read- Alekhya Tarakaratna: ఫస్ట్ టైం లవ్ స్టోరీ పై ఓపెన్ అయిన అలేఖ్య.. తారకరత్న పరిచయం,ప్రేమ పెళ్లి..

గోరేటి వెంకన్న వాయిస్ హైలెట్

Advertisement

వాస్తవానికి ఈ పాటను సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ పాడారు. ఆయన మొదటి రెండు చరణాలు పాడితే.. చివరిలో గోరేటి వెంకన్న అందుకున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ కంటే కూడా గోరేటి వెంకన్న (Goreti Venkanna) వాయిస్‌లో ఈ పాట వినడానికి చాలా చక్కగా ఉంది. పాటకు తగిన ఫీల్‌ని ఆ వాయిస్ తీసుకొస్తోంది. దేశీ మూలాలు, విదేశీ జీవితానికి మధ్య ఉన్న విరుద్ధ భావాలను సున్నితంగా ఈ పాట ప్రతిబింబిస్తోంది. ఈ సినిమా కథనానికి అనుగుణంగా ఈ పాట సాగుతుందని మేకర్స్ కూడా తెలిపారు. ఈ గీతానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ ఇచ్చిన సంగీతం కూడా హైలెట్ అనేలా ఉంది. ఈ పాట లండన్‌లోని అద్భుతమైన దృశ్యాలను ప్రదర్శిస్తూ సాగుతోంది. అంతర్జాతీయ ప్రకృతి దృశ్యాలను, తెలుగు స్వరాల మాధుర్యాన్ని మిళితం చేస్తూ ఈ పాటను పిక్చరైజ్ చేశారు.

Also Read- Bellamkonda Sreenivas: గ్రాండ్‌గా కావ్య రెడ్డి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రోకా వేడుక.. త్వరలోనే పెళ్లి!

‘బేబి’ జంట మరోసారి..

Advertisement

బ్లాక్‌బస్టర్ ‘బేబీ’ తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జోడి తెరపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ‘90s’ వెబ్ సిరీస్‌తో అందరి మనసులు గెలుచుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. వెంకట్ ఉప్పుటూరి, వి.ఎం.ఆర్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను భావోద్వేగాలతో కూడిన సెన్సిటివ్ ప్రేమకథగా నిర్మాతలు అభివర్ణిస్తున్నారు. యూత్‌ని టార్గెట్ చేస్తూ ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లుగా ఈ పాట, ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Also Read- Lechindi Mahila Lokam: ట్రైలర్ వచ్చేసింది.. లాయర్ ‘పుష్ప’గా మంచు లక్ష్మి అరాచకం!

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×