E-Paper
Advertisement

ఏ బ్యూటిఫుల్ మూమెంట్.. కాబోయే భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన బెల్లంకొండ హీరో!

ఏ బ్యూటిఫుల్ మూమెంట్.. కాబోయే భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన బెల్లంకొండ హీరో!
Advertisement

Bellamkonda: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న హీరోలు ఒక్కొక్కరిగా వైవాహిక బంధంలోకి అడుగు పెడుతూ.. అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నారు.. ఈ క్రమంలోనే ఇన్ని రోజులు బ్యాచిలర్ లైఫ్ కొనసాగించిన అల్లు శిరీష్ తన ప్రేయసి నయనికా రెడ్డితో ఏడడుగులు వేసి.. కొత్త బంధంలోకి అడుగు పెట్టారు. అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా 8 ఏళ్ల పాటు తన ప్రేమాయణం కొనసాగించి.. ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నతో ఏడడుగులు వేశారు. ఇక ఇప్పుడు మరో సెలబ్రిటీ కిడ్ బెల్లంకొండ వారసుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

కావ్య రెడ్డితో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం..

ఈ నేపథ్యంలోనే మార్చి నెలలో కావ్య రెడ్డితో తాను పెళ్లికి సిద్ధమయ్యాను అంటూ ప్రీ ఎంగేజ్మెంట్ ఈవెంట్ నిర్వహించి తన పెళ్లిని అధికారికం చేసిన ఈ హీరో.. నిన్న హైదరాబాదులోని ఒక రిసార్ట్ వేదికగా కావ్యా రెడ్డితో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ వేడుక అత్యంత సన్నిహితులు , కుటుంబ సభ్యుల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ క్యూట్ జంటను చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాబోయే భార్యకు సడన్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బెల్లంకొండ హీరో..

Advertisement

తాజాగా శ్రేయాస్ మీడియా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన కాబోయే భార్య కావ్య రెడ్డికి ఇచ్చిన స్పెషల్ సర్ప్రైజ్ కు సంబంధించిన వీడియోని షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.. రిసార్ట్ సభ్యులతో బెలూన్స్ ని ఎగరవేస్తూ..” నన్ను పెళ్లి చేసుకుంటావా?” అంటూ కావ్య రెడ్డి ముందు మోకరిల్లారు సాయి శ్రీనివాస్ ఆ తర్వాత ఆమె చేయి పట్టుకొని..ఆమె వేలికి ఉంగరాన్ని తొడిగారు. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది కావ్యా రెడ్డి . ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఏ బ్యూటిఫుల్ మూమెంట్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ALSO READ:LIK పై అనిల్ రావిపూడి ఫస్ట్ రివ్యూ.. ప్రదీప్ ఖాతాలో మరో హిట్ గ్యారెంటీ?

సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహం..

Advertisement

సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి వివాహం విషయానికి వస్తే.. తిరుమల తిరుపతి దేవస్థానంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా సెలబ్రిటీల మధ్య ఏప్రిల్ 29వ తేదీన ఈ జంట ఏడడుగులు వేయబోతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రముఖ నిర్మాత సురేష్ బెల్లంకొండ వారసుడిగా అల్లుడు శ్రీను సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చివరిగా భైరవం , కిష్కిందపురి సినిమాలలో నటించిన ఈయన.. ఇప్పుడు వ్యక్తిగతంగా బిజీగా మారిపోయారు. కావ్యా రెడ్డి తాతగారు జడ్జి కాగా, ఈమె తండ్రి లాయర్.. ఇకపోతే వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఇప్పుడు పెద్దలను ఒప్పించి వైవాహిక బంధం లోకి అడుగుపెట్టబోతున్నారు. మొత్తానికైతే ఇన్ని రోజులు బ్యాచిలర్ గా లైఫ్ ను కొనసాగించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. మరికొన్ని రోజుల్లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని చెప్పాలి . ఈ మేరకు అభిమానులు, సినీ సెలెబ్రిటీలు, పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×