E-Paper
Advertisement

బర్గ్ మాన్ స్ట్రీట్‌కు ABS వేరియంట్, క్రేజీ అప్ డేట్ ఇచ్చిన సుజుకి!

బర్గ్ మాన్ స్ట్రీట్‌కు ABS వేరియంట్, క్రేజీ అప్ డేట్ ఇచ్చిన సుజుకి!
Advertisement

Burgman Street 2026: రీసెంట్ గా మార్గెట్ లోకి అడుగు పెట్టిన కొత్త సుజుకి బర్గ్ మాన్ స్ట్రీట్ స్కూటర్ ఇప్పటికే మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర సుమారు రూ.1.02 లక్షలు కాగా, కొత్త ఫీచర్లు, మంచి డిజైన్, పెద్ద  బూట్ స్పేస్‌ తో ఈ మోడల్ మరింత ఆకర్షణీయంగా మారింది. సిటీ ప్రయాణాలకు అనువైన ఈ స్కూటర్ ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో ఒకటి రైడ్ కనెక్ట్, మరొకటి TFT/కీలెస్ ఇగ్నిషన్. అయితే, ఈ రెండు వేరియంట్లలో కూడా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS) అందుబాటులో లేకపోవడంతో కొంత మంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

భవిష్యత్ లో బర్గ్ మాన్ స్ట్రీట్‌కు ABS వేరియంట్‌

సుజుకి యాక్సెస్ లాంటి ఇతర స్కూటర్లలో ABS సదుపాయం ఇప్పటికే అందుబాటులో ఉంది. బర్గ్ మాన్ స్ట్రీట్‌ లో కూడా అదే ఫీచర్ ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్న వినియోగదారుల నుంచి వస్తోంది. ఈ విషయం కంపెనీ అధికారులకు తెలియడంతో రానున్న రోజుల్లో బర్గ్ మాన్ స్ట్రీట్‌ కు ABS వేరియంట్‌ను ప్రవేశపెట్టే అవకాశం చెప్పుకొచచారు. మరికొద్ది రోజుల్లోనే ఈ స్కూటర్ మరిన్ని భద్రతా ఫీచర్లతో మార్కెట్‌లోకి రావచ్చని తెలుస్తోంది.

ABS గురించి..

Advertisement

ABS అనేది కేవలం పెద్ద ఇంజిన్ బైక్‌ లకే అవసరమనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ, మన దేశంలోని రోడ్ల పరిస్థితులు చూస్తే, చిన్న స్కూటర్‌ కైనా ABS చాలా ఉపయోగపడుతుంది. దుమ్ము, కంకర, తడి రోడ్లు, అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితుల్లో, టైర్లు లాక్ కాకుండా నియంత్రణలో ఉంచడంలో ABS కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా సిటీ  ట్రాఫిక్‌ లో ఇది రైడర్‌కు అదనపు భద్రతను ఇస్తుంది.  ప్రస్తుతం టాప్ వేరియంట్ అయిన బర్గ్ మాన్ స్ట్రీట్ రైడ్ కనెక్ట్ TFT మోడల్ ధర సుమారు రూ. 1.13 లక్షల వరకు ఉంటుంది. ఒకవేళ ABS వేరియంట్‌ ను తీసుకువస్తే, దాని ధర సుమారు రూ. 5,000 నుంచి రూ. 6,000 వరకు పెరగవచ్చని  తెలుస్తోంది. అయితే, అదనపు ఖర్చుతో వచ్చే సేఫ్టీ ఫీచర్లు పరిగణనలోకి తీసుకుంటే, అది వినియోగదారులకు మంచి డీల్‌గా భావించవచ్చు.

ABSతో వస్తే మరింత పోటీ ఇచ్చే అవకాశం

సుజుకి సంస్థ ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తే, బర్గ్మాన్ స్ట్రీట్ పోటీ మోడల్స్ కు మరింత గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.  ముఖ్యంగా ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్‌ లో భద్రతా ఫీచర్లు కీలకంగా మారుతున్న ఈ సమయంలో, ABS చేరడం ద్వారా ఈ మోడల్‌కు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే స్టైల్, కంఫర్ట్, ఫీచర్ల పరంగా మంచి స్థాయిలో ఉన్న బర్గ్ మాన్ స్ట్రీట్, భవిష్యత్తులో ABS వేరియంట్‌ తో వస్తే, మరింత క్రేజీ స్కూటర్‌ గా మారుతుంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సుజుకి తీసుకునే నిర్ణయాలపై అందరి దృష్టి పడింది.

Advertisement

Read Also: తక్కువ టైమ్‌ లో ఫుల్ ఛార్జ్.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న టాప్ EV స్కూటర్లు ఇవే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×