Bhagya Shree Borse: మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన భాగ్యశ్రీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాలన్నీ కూడా పూర్తిగా ప్రేక్షకులను నిరాశపరిచాయి. దాదాపు నాలుగు ఐదు సినిమాలలో నటించినా భాగ్యశ్రీ కి గుర్తింపు రాకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఇకపోతే ఇటీవల భాగ్యశ్రీ (Bhagya Shree)అఖిల్ అక్కినేని హీరో హీరోయిన్లుగా నటించిన లెనిన్ సినిమా(Lenin Movie) విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.
ఇలా లెనిన్ సినిమా ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్న భాగ్యశ్రీ ఇప్పటివరకు తన తదుపరి సినిమా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే భాగ్యశ్రీ సినిమాల విషయంలో అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ సమాచారం ప్రకారం భాగ్యశ్రీ ఏకంగా మెగా హీరో సినిమాలో అవకాశం అందుకున్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇంతకీ ఆ మెగా హీరో ఎవరు? అనే విషయానికి వస్తే… పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ సినిమాలో ఈమె ఛాన్స్ అందుకున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి.
రామ్ చరణ్ ఇటీవల బుచ్చిబాబు సాన దర్శకత్వంలో నటించిన పెద్ది సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా అనంతరం ఈయన తన తదుపరి చిత్రాన్ని పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాలో నటించే హీరోయిన్లకు సంబంధించి ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి కానీ చిత్రబృందం మాత్రం ఇప్పటివరకు ఎవరిని అధికారకంగా ప్రకటించలేదు. అయితే తాజాగా ఈ జాబితాలోకి భాగ్యశ్రీ కూడా చేరిపోయారు. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా భాగ్యశ్రీ సంప్రదించినట్టు సమాచారం. మరి రామ్ చరణ్ సినిమాలో భాగ్యశ్రీ అంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ఇదే కనుక నిజమైతే ఇండస్ట్రీలో భాగ్యశ్రీకి ఇక తిరుగుండదని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇదివరకే సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సూపర్ సక్సెస్ కావడంతో RC 17 పై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!