Crime Thriller: భార్యకు మరో వ్యక్తితో ఎఫైర్ ఉందని తెలిసినా భర్త ఏమీ అనకుండా ఉంటే ? పైగా అదే ప్రియుడిని ఉపయోగించుకుని తన చావును నాటకంగా మార్చి కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేస్తే ? కానీ భర్త వేసిన ప్లాన్ కంటే భార్య వేసిన స్కెచ్ ఇంకా డేంజరస్‌గా ఉంటే ? ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో అర్థం కాకుండా చివరి వరకు నడిచే క్రైమ్ థ్రిల్లర్ ‘Just Play Dead’ ఇప్పుడు డిజిటల్‌లోకి వచ్చేసింది. శామ్యూల్ ఎల్. జాక్సన్, ఎవా గ్రీన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫేక్ డెత్, ఎఫైర్, ఇన్సూరెన్స్ స్కామ్, డబుల్ క్రాస్ చుట్టూ తిరుగుతుంది. మరి చనిపోయినట్లు నటించాలనుకున్న భర్తకు భార్య ఇచ్చిన షాక్ ఏంటి ? చివరికి 30 మిలియన్ డాలర్ల ఇన్సూరెన్స్ డబ్బు ఎవరి చేతికి వెళ్తుంది ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
జాక్ వోల్ఫ్ ఓ ధనవంతుడైన క్రిమినల్ మాస్టర్‌మైండ్. అతను చేసిన ఆర్థిక నేరాల కారణంగా ఫెడరల్ అధికారులు దగ్గరకు వస్తుండటంతో తప్పించుకునేందుకు దిమ్మతిరిగే ప్లాన్ వేస్తాడు. తాను చనిపోయినట్లు నమ్మించి, తన పేరుపై ఉన్న 30 మిలియన్ల డాలర్ల ఇన్సూరెన్స్ మొత్తాన్ని భార్య నోరాతో కలిసి తీసుకుని కొత్త జీవితం మొదలు పెట్టాలనుకుంటాడు.
కానీ ఈ ప్లాన్‌లో మరో వ్యక్తిని బలిపశువును చేయాలని జాక్ నిర్ణయించుకుంటాడు. నోరాతో సంబంధం ఉన్న చాడ్ ను తన ఫేక్ మర్డర్ కేసులో ఇరికించి, హంతకుడిగా చూపించాలని స్కెచ్ వేస్తాడు. ఇక్కడే అసలు గేమ్ రివర్స్ అవుతుంది. భర్త నియంత్రణలో బతికి విసిగిపోయిన నోరాకు కూడా సీక్రెట్ ప్లాన్ ఉంటుంది. చనిపోయినట్లు నటించడం ఎందుకు, జాక్‌ను నిజంగానే చంపేసి ఇన్సూరెన్స్ డబ్బంతా తానే తీసుకుంటే సరిపోతుందని భావిస్తుంది.
దీంతో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు స్కెచ్ లు వేస్తుంటారు. మధ్యలో చాడ్ ఇరుక్కుపోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. జాక్ కూడా అంత ఈజీగా మోసపోయే వ్యక్తి కాదు. తన భార్య ప్లాన్ ను పసిగట్టి ఆమెకు మరో ట్రాప్ వేస్తాడు. అక్కడి నుంచి ఎవరు వేటగాడు, ఎవరు బలి అనే విషయం ప్రతి సీన్ లో మారిపోతుంటుంది. అసలు జాక్ ఫేక్ డెత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా ? నోరా నిజంగానే భర్తను చంపగలదా ? చాడ్ పై మర్డర్ కేసు పడుతుందా ? చివరికి 30 మిలియన్లు ఎవరు కొట్టేస్తారు ? అనేదే సినిమాలో చూడాల్సిన థ్రిల్లింగ్ స్టోరీ.
మార్టిన్ క్యాంప్‌బెల్ దర్శకత్వం వహించిన ‘జస్ట్ ప్లే డెడ్ సినిమాలో శామ్యూల్ ఎల్. జాక్సన్, ఎవా గ్రీన్, ఇయాన్ మాకెన్, మారియా పెడ్రాజా, జేసన్ ఫెర్నాండెజ్ తదితరులు నటించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ 2026 ఆగస్టు 28న లిమిటెడ్ థియేట్రికల్ రిలీజ్ కాగా, సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్ VODలోకి వచ్చింది. అంటే రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే Apple TV లిస్టింగ్‌లో కూడా ఉంది. ప్రస్తుతం ఇంగ్లీష్ ఆడియో మాత్రమే ఉంది. ఎఫైర్, ఇన్సూరెన్స్ స్కామ్, భార్యాభర్తల డబుల్ క్రాస్, క్రైమ్ గేమ్‌లతో నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ లా సాగే ఈ సినిమా థ్రిల్లర్ మూవీ లవర్స్ కు ఒక డిఫరెంట్ ఛాయిస్.
Read Also: పగటిపూట సాధువులు, రాత్రికి సైకోలు… గూస్‌బంప్స్ తెప్పించే క్రైమ్ థ్రిల్లర్