E-Paper
Advertisement

Allu Aravind:  బాస్ ఈజ్ బాస్.. శంకర్ వరప్రసాద్ పై అల్లు అరవింద్ రివ్యూ..

Allu Aravind:  బాస్ ఈజ్ బాస్.. శంకర్ వరప్రసాద్ పై అల్లు అరవింద్ రివ్యూ..
Advertisement

Allu Aravind: టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మెగా అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి(Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చిరు సినిమాకు అల్లు అరవింద్ రివ్యూ..

చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి ఇలాంటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా అభిమానులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సినిమా చూసిన సంగతి తెలిసిందే .అయితే చిరంజీవి బావగారు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సైతం ఈ సినిమా చూశారని తెలుస్తోంది. ఈ సినిమా చూసిన అనంతరం అల్లు అరవింద్ తన అభిప్రాయాలను తెలియజేశారు. చిరంజీవి నటించిన ఈ సినిమా చూస్తుంటే ఆయన ఓల్డ్ సినిమాలు గుర్తుకొస్తున్నాయని అల్లు అరవింద్ తెలియజేశారు.

రీ ఎంట్రీ ది బెస్ట్ ఫిలిం..

Advertisement

ఒక మాటలో చెప్పాలంటే బాస్ ఈజ్ బాస్.. రౌడీ అల్లుడు ,ఘరానా మొగుడు వంటి సినిమాలు చూసిన తర్వాత అదే భావన ఇప్పుడు కలుగుతుందని అల్లు అరవింద్ తెలిపారు. డాన్స్ పరంగా కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  పరంగా వింటేజ్ చిరంజీవి గారిని చూపించారని చించేశారు అంటూ ఈయన తెలియజేశారు .ఇక వెంకటేష్ పాత్ర గురించి కూడా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ క్లైమాక్స్ అదిరిపోయింది.. సినిమా సూపర్ హిట్ , చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ది బెస్ట్ ఫిలిం అంటూ  మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాపై అల్లు అరవింద్ ఇచ్చిన ఈ రివ్యూ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఆ వార్తలు అవాస్తవమే..

Advertisement

గత కొంతకాలంగా మెగా అలు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారి ఈ వార్తలను ఖండిస్తూ ఈ రెండు కుటుంబాలు కలిసిపోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అల్లు అరవింద్ సైతం చిరంజీవి గురించి ఆయన సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడటంతో ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ఇందులో చిరంజీవికి జోడిగా నయనతార నటించిన సందడి చేశారు. ఈ సినిమాని సాహు గారు పాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే.

Also Read: Ravi Teja Remuneration: భర్త మహాశయులకు విజ్ఞప్తి కోసం రవితేజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Related News

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

Big Stories

Advertisement
×