E-Paper
Advertisement

Bheems Ceciroleo : ఏ ఫుట్పాత్ మీద పడుకునే వాడినో తెలియదు

Bheems Ceciroleo : ఏ ఫుట్పాత్ మీద పడుకునే వాడినో తెలియదు
Advertisement

Bheems Ceciroleo : సాహిత్య రచయితగా ఆయుధం సినిమాతోనే తన కెరీర్ మొదలు పెట్టాడు బీమ్స్. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ పాటలు కూడా హైలెట్ గా నిలిచాయి. ఆ తర్వాత కాలంలో కొన్ని సినిమాల్లో పాటలు రాస్తూ, పాటలు పాడుతూ సంగీత దర్శకుడుగా కూడా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.

కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయమైన సినిమా బలగం. ఆ సినిమా పాటలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. మంచి పేరును సంగీత దర్శకుడుగా బీమ్స్ కు తీసుకొచ్చాయి. అలానే ధమాకా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. రీసెంట్గా మాస్ జాతర సినిమాకి కూడా సంగీతం అందించాడు బీమ్స్. ఆ ఈవెంట్లో ఏ స్థాయిలో ఎమోషనల్ అయిపోయాడు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement

అల్లరి నరేష్ నటించిన రైల్వే కాలనీ సినిమా నవంబర్ 21న ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో భీమ్స్ మాట్లాడుతూ మరోసారి ఎమోషనల్ అయ్యాడు.

ఫుట్పాత్ పైన పడుకున్నాను

నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం అల్లరి నరేష్. ఆయన నువ్వా నేనా అనే సినిమాలో వారెవ్వా బ్లాక్ బెర్రీ ఫోన్ లే అనే పాట అవకాశం ఇవ్వకపోతే ఇక్కడి వరకు వచ్చి ఉండేవాడిని కాదు. అల్లరి నరేష్ గారు కలిసిన తర్వాతే నాకు పెళ్లి కూడా అయింది అంటూ మాట్లాడాడు.

Advertisement

ఏ పార్కులో పడుకునే వాడినో తెలియదు, ఏ ఫుట్పాత్ మీద పడుకునే వాడినో తెలియదు, ఎక్కడ తినేవాడినో తెలియదు అంటూ తన కష్టాలన్నీ చెప్పుకొని ఎమోషనల్ అయిపోయాడు.

మీ ముందుకు వచ్చేటప్పుడు దాని వెనకాల మేము రాత్రింబవళ్లు నిద్ర లేకుండా, ఇంటికి వెళ్ళకుండా కుటుంబంతో గడపకుండా స్నేహితులతో వెళ్లకుండా బంధువులతో వెళ్లకుండా పండగ వచ్చిన పండగలేనట్టు దేనికైనా సరే తెగించి ముందుండి పోరాడే ప్రతి కళాకారుడిని మనస్పూర్తిగా నమస్కారం.

అంత అవసరం ఉందా? 

చాలామంది ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. చాలామంది ఉన్నారు నన్ను మించిన వాళ్ల. ప్రతిభ గల వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళందరి జీవితాలు మెరుగుపడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నవంబర్ 21న ప్రేక్షకులు ముందుకు వస్తుంది చూసి ఆదరించాలి అని భీమ్స్ మాట్లాడాడు.

అయితే భీమ్స్ ప్రతి ఫంక్షన్లోనూ బాగా ఎమోషనల్ అయిపోతున్నారు అని అర్థమవుతుంది. ఆ స్థాయిలో మాట్లాడి ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం ఉందా అనేది కొంతమందికి వస్తున్న డౌట్.

Also Read: Allari Naresh : డైరెక్టర్ కు సారీ చెప్పిన అల్లరి నరేష్, నా వలన తిట్లు కాస్తున్నాడు

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×