E-Paper
Advertisement

Allari Naresh : డైరెక్టర్ కు సారీ చెప్పిన అల్లరి నరేష్, నా వలన తిట్లు కాస్తున్నాడు

Allari Naresh : డైరెక్టర్ కు సారీ చెప్పిన అల్లరి నరేష్, నా వలన తిట్లు కాస్తున్నాడు
Advertisement

Allari Naresh : అల్లరి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నరేష్. తన కెరీర్ లో ఎక్కువ కామెడీ సినిమాలు మాత్రమే ఉన్నాయి. అయితే కామెడీ సినిమాలు తో పాటు గమ్యం వంటి సినిమాల్లో కొంచెం విలక్షణమైన పాత్రలు కూడా వేశారు. ఆ సినిమాలో గాలి శీను అనే పాత్ర చాలామందికి విపరీతంగా గుర్తుండిపోతుంది. ఆ సినిమాలో పాత్ర చనిపోతుంది. వారి తండ్రి ఇవివి సత్యనారాయణ ఇలాంటి పాత్రలు చేయొద్దు అని బాధపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా అల్లరి నరేష్ పలు సందర్భాల్లో చెప్పారు.

వరుసగా కామెడీ సినిమాలు చేస్తున్న కూడా ఒక తరుణంలో బాక్స్ ఆఫీస్ వద్ద అవి వర్కౌట్ కాలేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్లే ఫెయిల్ అవుతూ ఉన్నాయి. అల్లరి నరేష్ సినిమాలకు ఆదరణ తగ్గిపోయింది అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ తరుణంలో విజయ్ దర్శకుడుగా పరిచయమైన సినిమా నాంది. అల్లరి నరేష్ ఈ సినిమాలో హీరోగా నటించారు.

డైరెక్టర్ విజయ్ కు సారీ 

Advertisement

నాంది సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. చాలామంది విపరీతంగా ఆ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా కమర్షియల్ గా కూడా ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది.

ఆ సినిమా సక్సెస్ సాధించిన తర్వాత ఉన్న ఏకైక కామెడీ హీరోని సీరియస్ జోన్ కి తీసుకు వెళ్లిపోయావు అంటూ విజయ్ ను చాలామంది తిట్టారట. ఇప్పటికీ కూడా కొంతమంది అదే మాటను విజయ్ తో అంటూ ఉంటారు. దానికి నేను విజయ్ కి సారీ చెబుతున్నాను అంటూ అల్లరి నరేష్ మాట్లాడారు.

Advertisement

అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఉగ్రం సినిమా ఊహించిన స్థాయి సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం రైల్వే కాలనీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు నరేష్.

నాకు ఆశ్చర్యం వేసింది 

రైల్వే కాలనీ సినిమాలో నరేష్ తో పాటు కామాక్షి భాస్కర్ల నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ జరుగుతుంటే చాలా బిజీగా కనిపించేది కామాక్షి. ఏం చేస్తున్నారు అని అడిగితే ఆవిడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తున్నారు అని చెప్పేవాళ్ళు.

అలానే కొన్ని సందర్భాల్లో అకౌంట్స్ కూడా చూస్తూ ఉండేది. చాలామంది ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డారు. నేను మాత్రం వచ్చి కేవలం యాక్టింగ్ చేసి వెళ్లిపోయేవాడిని. నేను డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ హీరో గానే ఉండాలి అనుకుంటున్నాను అని కూడా చెప్పారు. మొత్తానికి నవంబర్ 21న విడుదలయ్యే ఈ సినిమాను అందరూ చూడాలి అని పిలుపునిచ్చారు అల్లరి నరేష్.

Also Read: Nithiin : ఆ విలక్షణ దర్శకుడు తో నితిన్ సినిమా, ఇతనైన హిట్ ఇస్తాడా?

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×