E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (18/11/2025) ఆ రాశి ఉద్యోగులకు అకస్మిక ట్రాన్స్ ఫర్లు – వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త  

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (18/11/2025) ఆ రాశి ఉద్యోగులకు అకస్మిక ట్రాన్స్ ఫర్లు – వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త  
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ 16వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:  

 వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అధికారులతో చర్చలకు అనుకూల సమయం. సన్నిహితులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

వృషభ రాశి:

Advertisement

సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.

మిథున రాశి:  

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కర్కాటక రాశి:

Advertisement

కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.

సింహరాశి:

గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

కన్యారాశి :

నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో గాని పూర్తి కావు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోక నష్టాలు ఎదుర్కొంటారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయట సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక సమయంలో సన్నిహితులు సాయం అందిస్తారు.

వృశ్చికరాశి:

కుటుంబ సభ్యులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట చికాకులు అధికమవుతాయి. స్వంత ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వ్యాపారాలలో భాగస్వాములతో బేధాభిప్రాయాలు కలుగుతాయి.

ధనస్సు రాశి:

ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంఘంలో మరింత గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు. నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.

మకరరాశి:

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగమున మీప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధు మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

కుంభరాశి:

దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు.

మీనరాశి:

ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలు తప్పవు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఎంతగా కష్టపడ్డా ఫలితం ఉండదు.

 ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×