E-Paper
Advertisement

Flora Saini : ‘మీ మగ బుద్ధే వంకర’.. ఎమ్మెల్సీ దువ్వాడపై నిప్పులు చెరిగిన బిగ్ బాస్ నటి

Flora Saini : ‘మీ మగ బుద్ధే వంకర’.. ఎమ్మెల్సీ దువ్వాడపై నిప్పులు చెరిగిన బిగ్ బాస్ నటి
Advertisement

Flora Saini : టాలీవుడ్ నటుడు శివాజీ రేపిన దుస్తుల మంటలు ఇంకా చల్లారడం లేదు. హీరోయిన్లు వేసుకునే బట్టలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే అనసూయ, చిన్మయి, నిధి అగర్వాల్ వంటి స్టార్ల ఆగ్రహానికి గురవ్వగా.. తాజాగా ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ ఇష్యూలో శివాజీకి మద్దతుగా నిలవడమే కాకుండా, ఆడవారిపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త దుమారానికి దారితీశాయి.

దువ్వాడ వ్యాఖ్యలేంటి?
శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్లు చీర కప్పుకుంటే అందం.. విప్పుకుంటే అసహ్యం అంటూ ఆయన తన వాదనను వినిపించారు. ఆడవారి గౌరవం వస్త్రధారణలోనే ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి ఆడవారి పట్ల ఇలాంటి భాష వాడటంపై బిగ్ బాస్ నటి ఫ్లోరా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisement

వంకర మీ బుద్ధి
దువ్వాడ చేసిన వ్యాఖ్యలపై బిగ్ బాస్ ఫేమ్, నటి ఫ్లోరా సైనీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లైవ్ డిబేట్‌లో పాల్గొన్న ఆమె, దువ్వాడపై ప్రత్యక్షంగా నిప్పులు చెరిగారు. మీ మగ బుద్ధే వంకరగా ఉంది. సమస్య బట్టల్లో లేదు.. చూసే మీ కళ్ళలో, మీ ఆలోచనల్లో ఉంది. ఆడవాళ్లు ఏం వేసుకోవాలో నిర్ణయించడానికి మీరెవరు? అంటూ ఆమె రెచ్చిపోయి మాట్లాడారు. బట్టల గురించి మాట్లాడే ముందు, మహిళల పట్ల గౌరవంగా ఉండటం నేర్చుకోవాలని ఆమె హితవు పలికారు. ఫ్లోరా సైనీ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ముదురుతున్న వివాదం
ఒకవైపు, అనసూయ, చిన్మయి, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు కూడా శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ.. వృత్తిపరంగా తాము వేసుకునే దుస్తులను కించపరచడం సరికాదని స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ దువ్వాడ, కరాటే కల్యాణి వంటి వారు శివాజీకి మద్దతుగా నిలబడుతూ తమ వాదనను వినిపిస్తున్నారు. మొత్తానికి, ఒక చిన్న ఈవెంట్‌లో మొదలైన ఈ డ్రెస్ కోడ్ రచ్చ.. ఇప్పుడు టాలీవుడ్‌ను రెండు వర్గాలుగా చీల్చేసింది. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా? లేక ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Advertisement

 

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×