E-Paper
Advertisement

Indian Railways: ఇకపై సెల్ ఫోన్లలో టికెట్లు చూపించకూడదట, రైల్వే షాకింగ్ డెసిషన్!

Indian Railways: ఇకపై సెల్ ఫోన్లలో టికెట్లు చూపించకూడదట, రైల్వే షాకింగ్ డెసిషన్!
Advertisement

Indian Railway: టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఆన్ లైన్ లోనే రైల్వే టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ప్రయాణ సమయంలో లక్షలాది మంది ప్రయాణికులు టికెట్లను చూపించడానికి తమ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. తాజాగా భారతీయ రైల్వే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తాజా డెసిషన్ ప్రకారం ఇకపై మొబైల్ లో కొన్ని టికెట్లను చూపించడం యాక్సెప్ట్ చేయమని వెల్లడించింది. డిజిటల్ మోసాల కారణంగా, ప్రయాణీకుల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెళ్లడించింది.

ఈ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం ఏంటి?

గత కొన్ని నెలలుగా నకిలీ టికెట్లతో ప్రయాణం, వ్యవస్థీకృత మోసాలు పెరుగుతున్నట్లుగా భారతీయ రైల్వే గుర్తించింది. నమ్మేలా ఉండే నకిలీ టికెట్లను క్రియేట్ చేయడానికి ఏఐ టూల్స్ ను ఉపయోగిస్తున్నట్లు తెలుసుకుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం రైల్వే ఏఐని విస్తరిస్తున్నప్పటికీ.. కొంత మంది మిస్ యూజ్ చేస్తున్నారు. కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. కఠిన చర్యలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని భావించి, ఈ నిర్ణయం తీసుకుంది. నకిలీ టికెట్లు నిజమైన ప్రయాణీకులు నమ్మకాన్ని దెబ్బతీయడంతో పాటు రైల్వే ఆదాయానికి నష్టం కలిగిస్తుందనే భావిస్తోంది. అందులో భాగంగానే ఇకపై సెల్ ఫోన్లలో టికెట్లను చూపించడాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపింది.

ప్రయాణీకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవంటే?

Advertisement

రైల్వే తాజా నిర్ణయం ప్రకారం.. UTS యాప్, ATVM మెషీన్స్ నుంచి బుక్ చేసిన, రైల్వే కౌంటర్ల నుంచి కొనుగోలు చేసిన  రిజర్వ్ చేయని టికెట్లు మొబైల్ లో మాత్రమే చూపిస్తే చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించబడవు. అలాంటి టికెట్లపై  ప్రయాణించే ప్రయాణీకులు ప్రింట్ చేసిన హార్డ్ కాపీని తీసుకెళ్లాలి. ఈ పరిమితి రిజర్వ్ చేసిన ప్రయాణాలకు ఇ టికెట్లు, ఎం టికెట్లకు వర్తించదని రైల్వే వెల్లడంచింది. వీటిని గతంలో మాదిరిగానే డిజిటల్‌గా చూపింవచ్చని తెలిపింది.

ఈ నిర్ణయం ముందు ఏం జరిగింది?  

జైపూర్ మార్గంలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన తర్వాత రైల్వే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. సాధారణ తనిఖీలో, విద్యార్థులు ఫోన్‌లో చూపించిన పూర్తిగా చెల్లుబాటు అయ్యే టికెట్‌పై ప్రయాణిస్తున్నట్లు కనుగొనబడింది. ఇందులో QR కోడ్, సరైన ఛార్జీ వివరాలు, పూర్తి ప్రయాణ సమాచారం ఉన్నాయి. నిశితంగా పరిశీలించినప్పుడు.. టికెట్ ఎగ్జామినర్ ఏడుగురు ప్రయాణికుల పేర్లను జోడించడం ద్వారా ఒకే అన్‌ రిజర్వ్డ్ టికెట్‌ను సవరించడానికి AI టూల్ ను ఉపయోగించారని గుర్తించాడు. దీని ద్వారా ఒకే టికెట్‌లో ఎక్కువ మంది వ్యక్తులు ప్రయాణించవచ్చు.  ఈ సంఘటన తర్వాత అన్ని రైల్వే డివిజన్లలో హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. QR కోడ్‌లను స్కాన్ చేయడానికి, UTS నంబర్‌లను ధృవీకరించడానికి, కలర్ కోడ్‌లను వెంటనే నిర్ధారించడానికి టికెట్ ఎగ్జామినర్‌లకు ప్రత్యేక చెకింగ్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రిజర్వ్ చేయని టికెట్ల హార్డ్ కాపీని తీసుకెళ్లడం అవసరమని అధికారులు సూచించారు. మొబైల్ లో టికెట్ చూపిస్తే, జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు.

Advertisement

Read Also: ఫుల్లుగా తాగి ట్రాక్ మీద ఆటోను వదిలేసిన డ్రైవర్, ఒక్కసారిగా వందేభారత్..

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×