E-Paper
Advertisement

Pawan Kalyan Heroine: ‘ఇలా అయితే దేశం మారదు’… పొలిటికల్ లీడర్స్‌పై పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఫైర్

Pawan Kalyan Heroine: ‘ఇలా అయితే దేశం మారదు’… పొలిటికల్ లీడర్స్‌పై పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఫైర్
Advertisement

Pawan Kalyan Heroine: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అత్తారింటికి దారేది సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో బొంగరం లాంటి కళ్ళు తిప్పి బాపు బొమ్మ లాగా మనం మదిలో నిలిచిపోయిన హీరోయిన్ ప్రణీత సుభాష్. ఈ హీరోయిన్ చేసిన.. ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. సాధారణ ప్రజలు రోజూ ఎదుర్కొనే సమస్యను చాలా స్పష్టంగా ఆమె తన ట్వీట్ ద్వారా బయట పెట్టింది. నగరంలోని రోడ్లు మూసివేయడం, ట్రాఫిక్ సమస్యలు, సాధారణ ప్రజలు పడే ఇబ్బందులపై ప్రణీత ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రణీత తన ట్వీట్‌లో.. నగర కేంద్రానికి వెళ్లే రోడ్లు.. కోరమంగళ ప్రాంతంలో రహదారులు మూసివేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. కేవలం ఒక రాజకీయ నాయకుడి VIP కదలికల కోసమే ఇలా రోడ్లు బ్లాక్ చేయడం సరైంది కాదని ఆమె అభిప్రాయపడింది. దీని వల్ల ఉద్యోగాలు, స్కూల్‌కు వెళ్లే పిల్లలు, అత్యవసర పనులు ఉన్నవారు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది.

Advertisement

“ఇలాంటి పరిస్థితుల వల్లే భారత్ ముందుకు వెళ్లడం లేదని” ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ నాయకుల VIP జీవితం సాధారణ ప్రజలకు ఉపయోగం లేకుండా సమస్యలే సృష్టిస్తోందని ఆమె తన ట్వీట్‌లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మాటలు కొందరికి నచ్చగా.. మరికొందరు ఆమె అభిప్రాయానికి విరుద్ధంగా స్పందిస్తున్నారు.

ప్రణీత ట్వీట్‌కు పెద్ద సంఖ్యలో లైక్స్, రీపోస్టులు వచ్చాయి. చాలామంది నెటిజన్లు ఆమె మాటలకు మద్దతు తెలుపుతూ “ఇది ప్రతి సామాన్యుడి బాధ” అని కామెంట్లు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం రాజకీయ నాయకులు VIPలే, భద్రత కోసం ఇలాంటి ఏర్పాట్లు తప్పవు అని వాదిస్తున్నారు. దీంతో ఈ అంశం సోషల్ మీడియాలో వేడి చర్చగా మారింది.

Advertisement

ప్రణీత సుభాష్ తెలుగులో అత్తారింటికి దారేది సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ సరసన నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం.. సంపాదించింది. ఆ తర్వాత పలు తెలుగు, కన్నడ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది.

సాధారణంగా సెలబ్రిటీలు రాజకీయ విషయాలపై మాట్లాడడానికి వెనుకడుగు వేస్తారు. కానీ ప్రణీత మాత్రం సామాన్యుల సమస్యను ధైర్యంగా బయటపెట్టింది. అందుకే ఆమె ట్వీట్‌కు ఇంత ప్రాధాన్యం.. లభించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, VIP కల్చర్‌పై పెద్ద చర్చకు దారి తీసింది.

ALSO READ: Mana Shankar Vara Prasad Garu: ఒక్క రోజు తేడా.. మెగాస్టార్ సినిమాకు భారీ నష్టం..ఏకంగా 100 కోట్లు మిస్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×