E-Paper
Advertisement

బాలీవుడ్‌లో రూ. 400 కోట్ల లీగల్ వార్.. ముంబై హైకోర్టులో డేవిడ్ ధావన్ వర్సెస్ వాషూ భగ్నానీ

బాలీవుడ్‌లో రూ. 400 కోట్ల లీగల్ వార్.. ముంబై హైకోర్టులో డేవిడ్ ధావన్ వర్సెస్ వాషూ భగ్నానీ
Advertisement

Song Controversy: ఇండస్ట్రీ లో వినోదం వివాదం కలిసి సావాసం చేస్తాయని,కమర్షియాలిటీ చుట్టే కాంట్రవర్సీలు చక్కర్లు కొడతాయని  స్పెషల్ గా చెప్పక్కర్లేదు.అదిగో అలాంటి ఓ కమర్షియల్ కాంట్రవర్సీ మరోసారి తెరమీదకి వచ్చింది.విషయంలోకి వెళ్తే పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత వాషూ భగ్నానీ, సీనియర్ మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ మధ్య రేగిన ఈ సరికొత్త వివాదం ఇప్పుడు బి-టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

డేవిడ్ ధావన్ డైరెక్షన్‌లో ఆయన కుమారుడు వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే లీడ్ రోల్స్ పోషిస్తున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’  జూన్ 5న థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయిపొయింది.గతంలో తండ్రీకొడుకుల కాంబోలో వచ్చిన ‘మై తేరా హీరో’ (2014), ‘జుడ్వా 2’ (2017), ‘కూలీ నెం. 1’ (2020) చిత్రాల తరహాలోనే ఈ సినిమాపై కూడా ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయి.అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ఇప్పుడు ఓ పాత సూపర్ హిట్ సాంగ్ లీగల్ చిక్కుల్లోకి నెట్టేసింది.

Advertisement

‘చునరీ చునరీ’ సాంగ్ నేటికీ ఎవర్ గ్రీన్ బ్లాక్‌బస్టర్

సరిగ్గా 1999 మే 28న థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్ల ‘బీవీ నెం. 1’ చిత్రంలోని ‘చునరీ చునరీ’ సాంగ్ నేటికీ ఎవర్ గ్రీన్ బ్లాక్‌బస్టర్. అయితే, తమ అనుమతి లేకుండా ఈ ఐకానిక్ నంబర్‌ను వరుణ్ ధావన్ కొత్త సినిమాలో రీమిక్స్ చేశారంటూ ఆనాటి ప్రొడ్యూసర్ వాషూ భగ్నానీ ఏకంగా రూ. 400 కోట్ల భారీ నష్టపరిహారం డిమాండ్ చేస్తూ కోర్టులో దావా వేశారు. ఒకవేళ తమ అభ్యంతరాలను పక్కనబెట్టి ఈ వివాదాస్పద కంటెంట్‌ను ఇలాగే థియేటర్లలోకి తెస్తే అదనంగా మరో రూ. 100 కోట్లు (మొత్తం రూ. 500 కోట్లు) లీగల్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని గట్టి వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Also read :ఉదయనిధి వ్యాఖ్యలపై యాక్షన్ కింగ్ ‘బ్లాస్ట్’.. సనాతన ధర్మంపై అర్జున్ సర్జా సంచలన కామెంట్స్!

ఈ వ్యవహారంపై భగ్నానీ లీగల్ అడ్వైజర్ వి.కె. దూబే స్పందిస్తూ, నాడు కేవలం ఆడియో హక్కులను మాత్రమే టిప్స్ సంస్థకు విక్రయించామని, కానీ ఇప్పుడు వారు ఇల్లీగల్‌గా వీడియో హక్కులను కూడా వాడుకుంటూ రూల్స్ బ్రేక్ చేశారని ఆరోపించారు. ఈ క్రమంలోనే డేవిడ్ ధావన్, రమేష్ తౌరానీలపై చీటింగ్, ఫోర్జరీ వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు కూడా నమోదైనట్లు లీగల్ టీమ్ వెల్లడించింది.

లైట్ తీసుకున్న రమేష్ తౌరానీ 

మరోవైపు, ఈ లీగల్ అటాక్‌ను ‘టిప్స్ ఇండస్ట్రీస్’ బాస్ రమేష్ తౌరానీ లైట్ తీసుకున్నారు. ఈ సమస్యలన్నీ త్వరలోనే సర్దుమణిగిపోతాయని, సినిమా ప్రమోషన్స్ కానీ, రిలీజ్ కానీ ఆగిపోయే ప్రసక్తే లేదని చాలా కాన్ఫిడెంట్‌గా ప్రకటించారు. తాము చట్టబద్ధంగానే ఆ సాంగ్ రైట్స్ ని కలిగి ఉన్నామని చెబుతూ, మే 22న సుప్రీంకోర్టు నుండి కూడా తమకు అనుకూలంగా లీగల్ రిలీఫ్ లభించినట్లు టిప్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది.

అయితే ఈ ట్విస్ట్ కు పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ లీగల్ టీమ్ మరో కౌంటర్ ఇచ్చింది. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా టిప్స్ సంస్థ సుప్రీంకోర్టు నుండి ఆ ఆర్డర్స్ తెచ్చుకుందని, పూర్తి వాస్తవాలను కోర్టు ముందు ఉంచి లీగల్ ఫైట్ చేయడానికి తాము మళ్లీ పిటిషన్ వేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఈ మొత్తం హైడ్రామాపై వాషూ భగ్నానీ ఎమోషనల్ అవుతూ, ఇది కేవలం డబ్బు కోసం చేస్తున్న పోరాటం కాదని, పరిశ్రమలో నైతికతకు, మేధో సంపత్తి హక్కుల (IPR) రక్షణకు సంబంధించిన పెద్ద యుద్ధమని తేల్చి చెప్పారు. తానే స్వయంగా నిర్మించిన ‘బీవీ నెం. 1’ లోని సూపర్ హిట్ పాటను, కనీసం ఆ చిత్రంలోని లైన్‌తోనే పెట్టిన ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ టైటిల్‌ను తమకు చెప్పకుండా ఎలా వాడుకుంటారని ప్రశ్నించారు.

Also read :అమ్మపై ప్రేమే ఒక అడవిగా.. 6.5 లక్షల చెట్లతో చరిత్ర సృష్టించిన సాయాజీ షిండే!

డేవిడ్ ధావన్ తనకు ఎంతో ఆప్తుడని, కనీసం ఒక ఫోన్ కాల్ చేసి పర్మిషన్ అడిగి ఉంటే తానే ఉచితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఇచ్చేవాడినని ఆవేదన వ్యక్తం చేశారు. 90ల నాటి క్లాసిక్ సాంగ్ చుట్టూ ముంబై హైకోర్టులో నడుస్తున్న ఈ లీగల్ బ్యాటిల్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×