E-Paper
Advertisement

కొత్త టియాగో EVలో క్రేజీ కలర్స్, ఏ వేరియంట్‌ లో ఏ కలర్ అందుబాటులో ఉందంటే?

కొత్త టియాగో EVలో క్రేజీ కలర్స్, ఏ వేరియంట్‌ లో ఏ కలర్ అందుబాటులో ఉందంటే?
Advertisement

2026 Tata Tiago EV Color Options: టాటా మోటార్స్ తాజాగా విడుదల చేసిన 2026 టియాగో EV ఫేస్‌ లిఫ్ట్ కొత్త డిజైన్, సరికొత్త ఫీచర్లతో పాటు క్రేజీ కలర్ ఆప్షన్స్ తో మరింత ఆకట్టుకుంటుంది. టియాగో EV భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా కొత్త కలర్ ఆప్షన్లు ఈ కారుకు ఫ్రెష్ లుక్ తీసుకొచ్చాయి.

మొత్తం ఆరు రంగుల్లో 2026 టియాగో EV ఫేస్‌ లిఫ్ట్

ఈసారి టాటా మూడు కొత్త రంగులను పరిచయం చేసింది. సోబో సర్జ్, పాంగోంగ్ పల్స్,  డెహ్రాడూన్ డ్యూ అనే కొత్త షేడ్స్ ఇప్పుడు టియాగో EVలో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఇప్పటికే ఉన్న ప్యూర్ గ్రే, ప్రిస్టీన్ వైట్, డేటోనా గ్రే రంగులు కూడా కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌ బ్యాక్ ఆరు కలర్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది.

Advertisement

బేస్ వేరియంట్ అయిన స్మార్ట్ 19లో నాలుగు రంగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్యూర్ గ్రే, ప్రిస్టీన్ వైట్, డేటోనా గ్రే, పాంగోంగ్ పల్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చిన సోబో సర్జ్, డెహ్రాడూన్ డ్యూ రంగులు ఈ వేరియంట్‌ లో ఇవ్వలేదు. ప్యూర్ ప్లస్ 19, ప్యూర్ ప్లస్ 24 వేరియంట్లలో అన్ని కలర్స్ ఉన్నాయి. ముఖ్యంగా కొత్త సోబో సర్జ్, డెహ్రాడూన్ డ్యూ కలర్స్ మిడ్ వేరియంట్లలో అందుబాటులో ఉండటం కొనుగోలుదారులను ఆకట్టుకుంటుంది.  టాప్ ఎండ్ క్రియేటివ్ ప్లస్ 24 వేరియంట్  లో అన్ని రంగులు డ్యూయల్ టోన్ ఫినిష్‌ తో వస్తున్నాయి. బ్లాక్ రూఫ్‌ తో కలిపిన స్పోర్టీ లుక్ లో ఆకట్టుకుంటుంది. టియాగో EV మరింత ప్రీమియం ఫీల్ ఇస్తుంది.

2026 టియాగో EV ఫేస్‌ లిఫ్ట్ గురించి..

కొత్త టియాగో EV ముందు భాగం పూర్తిగా మారింది. చిన్న గ్రిల్, సన్నని LED హెడ్‌ల్యాంప్స్, కొత్త DRLs  మోడ్రన్ లుక్ ఇస్తున్నాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.  ఇంటీరియర్‌లో కూడా పెద్ద మార్పులు చేశాయి. 10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త డాష్‌ బోర్డ్ డిజైన్, వైర్‌లెస్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం 360 డిగ్రీల కెమెరా ఫీచర్‌ ను అందించింది. అదనంగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జింగ్, ముందు వెనుక AC వెంట్లు, టైప్ C ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.  టియాగో EV రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. 19.2 kWh బ్యాటరీ ప్యాక్ 226 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తే, 24 kWh బ్యాటరీ ప్యాక్ 285 కిలోమీటర్ల వరకు MIDC రేంజ్ అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రెండు బ్యాటరీలను 35 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. 2026 టాటా టియాగో EV ధర రూ. 6.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 9.99 లక్షల వరకు ఉంటుంది.

Advertisement

Read Also: కామెట్ ఈవీ vs టియాగో ఈవీ.. రెండింటిలో ఏ కారు కొంటే మంచిది?

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×