E-Paper
Advertisement

Hero Suhas: సుహాస్ సినిమా షూటింగ్ సెట్లో ఘోర ప్రమాదం.. భారీగా నష్టం!

Hero Suhas: సుహాస్ సినిమా షూటింగ్ సెట్లో ఘోర ప్రమాదం.. భారీగా నష్టం!
Advertisement

Hero Suhas:సాధారణంగా సినిమా షూటింగ్ జరిగేటప్పుడు సెట్లో అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అది అగ్నిప్రమాదం కావచ్చు లేదా యాక్సిడెంట్ లేదా మరేదైనా .. ఇలా ఏదో ఒక నష్టం జరుగుతుంది అనడంలో సందేహం లేదు. అందుకే చిత్ర బృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అప్పుడప్పుడు జరిగే ఈ ప్రమాదాలు అందరిని భయాందోళనకు గురిచేస్తూ ఉంటాయి. సరిగ్గా ఇప్పుడు ఇలాంటి ఒక ఘటన అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. అసలు విషయంలోకి వెళ్తే.. సుహాస్ (Suhas) హీరోగా నటిస్తున్న ఒక సినిమా షూటింగ్ ప్రస్తుతం శరగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సెట్లోనే పడవ బోల్తా కొట్టడంతో భారీగా నష్టం ఏర్పడినట్లు సమాచారం.

సుహాస్ సినిమా షూటింగ్ సెట్లో ఘోర ప్రమాదం..

తమిళ్ , తమిళ్ భాషలలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ చిత్రం ‘మండాడి’. సముద్ర ప్రాంతాలలో ఈ సినిమా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తూ ఉండగా .. సాంకేతిక నిపుణులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ క్రమంలోనే కోటి రూపాయలు విలువచేసే కెమెరాలు, ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగిపోయారు.. ఇకపోతే నీటిలో మునిగిన యూనిట్ సభ్యులను రక్షించడంతో ప్రాణనష్టం తప్పింది. కానీ కోటి రూపాయల విలువ చేసే సినిమా సామాగ్రి మాత్రం పూర్తిగా తడిసి పాడైపోయింది.. ఇక్కడ ప్రాణ నష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం రామనాథపురం జిల్లా తొండి సముద్ర తీరంలో చోటుచేసుకుంది. ఏది ఏమైనా అనుకోకుండా జరిగే ఈ ప్రమాదాలు చిత్ర బృందానికి భారీ నష్టాన్ని మిగులుస్తాయని చెప్పడంలో సందేహం లేదు.

మండాడి సినిమా విశేషాలు..

Advertisement

మండాడి సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ తమిళ నటుడు సూరి(Soori ) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తెలుగు హీరో సుహాస్ విలన్ గా నటిస్తున్నారు. ఇదే చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. తమిళ్లో హీరోగా చేస్తున్న సూరి ఇదే సినిమాలో తెలుగులో విలన్ గా చేస్తున్నారు. అటు సుహాస్ హీరోగా కనిపించనున్నారు. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాను చాలా అద్భుతంగా అనూహ్య మలుపులతో నిర్మిస్తుండడంతో అంచనాలు బాగా పెరిగిపోయాయి. మరి సూరి, సుహాస్.. ఇటు హీరోగా.. అటు విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తారో చూడాలి.

ALSO READ:Rashmika -Vijay Deverakonda: ఇద్దరి ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?

హీరో సుహాస్ కెరియర్..

Advertisement

సుహాస్ కెరియర్ విషయానికి వస్తే.. మొదట షార్ట్ ఫిలిమ్స్ లో నటించి కెరియర్ మొదలుపెట్టిన ఈయన 2018లో విడుదలైన పడి పడి లేచే మనసు సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత కలర్ ఫోటో సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన .. అప్పటినుంచి వరుస పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ కలర్ ఫోటో చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు కూడా లభించింది. ప్రస్తుతం కేబుల్ రెడ్డి, ఆనందరావు అడ్వెంచర్స్ వంటి చిత్రాలను లైన్ లో పెట్టారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×