Rashmika -Vijay Deverakonda: తెలుగు సినీ ఇండస్ట్రీలో రూమర్డ్ జంటగా పేరు సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna). ‘గీతా గోవిందం’ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారిందని వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఇద్దరు ప్రేమ పక్షుల్లా విహరిస్తూ.. కెమెరా కంటికి చిక్కుతూనే ఉన్నారు. వెకేషన్స్ కి వెళ్లడం, ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో కనిపించడం.. పైగా రష్మిక విజయ్ ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడడం.. అటు సినిమా ఈవెంట్లలో కూడా విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) తో నువ్వు నా ఫ్యామిలీ అని చెప్పడం.. అన్నీ కూడా వీరిద్దరి మధ్య బంధాన్ని మరింత బలం చేశాయి.
అయితే వీరిద్దరూ ఏ రోజు కూడా తమ విషయాన్ని బయట పెట్టలేదు. ఇంకెన్నాళ్లు అంటూ అభిమానులు కూడా ఆశగా ఎదురుచూసిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు గత రెండు రోజుల క్రితం రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై కూడా ఈ జంట ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడలేదు. ఇప్పుడు వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరు వివాహం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారట.
ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ, రష్మికలకు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరి ఆస్తి విలువ ఎంత ఉంటుంది అంటూ అటు అభిమానులు కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు. మొదట విజయ్ దేవరకొండ ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ అలరించిన ఈయన.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషించి ఆకట్టుకున్నారు. ‘అర్జున్ రెడ్డి’ తో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయారు. చివరిగా ‘కింగ్డమ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు విజయ్ దేవరకొండ.
ALSO READ:Sailesh kolanu: హిట్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఫిక్స్.. హీరో ఆయనే.. త్వరలో అనౌన్స్మెంట్!
ఈయన ఆస్తుల వివరాల విషయానికొస్తే.. ఒక్కో సినిమాకు సుమారుగా రూ.12 కోట్ల వరకు తీసుకుంటున్నారట.. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఒక్కో బ్రాండ్ ఎండార్స్మెంట్ కి కోటి రూపాయల వరకు తీసుకుంటున్న విజయ్ దేవరకొండ.. సొంతంగా వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఈ కామర్స్ సంస్థ మింత్ర ఫ్యాషన్ బ్రాండ్ తో కలిసి సొంత రౌడీ బ్రాండ్ ను కూడా స్థాపించారు. అలాగే గుడ్ వైబ్ ఓన్లీ కేఫ్ కూడా నిర్వహిస్తున్న విజయ్ దేవరకొండ.. హైదరాబాద్ బ్లాక్ హాక్ అనే వాలీబాల్ జట్టుకి కూడా సహాయజమానిగా వ్యవహరిస్తున్నారు. అలాగే లగ్జరీ కార్లు, ఖరీదైన బంగ్లాలు ఈయన సొంతం. మొత్తంగా రూ.75 కోట్ల వరకు ఈయన ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది.
రష్మిక ఆస్తులు వివరాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి 5 నుండి 8 కోట్ల వరకు వసూలు చేస్తున్న ఈమె.. సొంతంగా వ్యాపారాలు కూడా మొదలుపెట్టింది. అలాగే ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 70 కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. బ్రాండ్ ఎండార్స్మెంట్ లకు కోటి రూపాయల వరకు వసూలు చేస్తోంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెడుతున్న ఈమె.. హైదరాబాదు తో పాటు మరో నాలుగు ప్రధాన నగరాలలో సొంతంగా ఇళ్లు కూడా ఉన్నాయి. ఇలా మొత్తానికైతే అటు విజయ్ దేవరకొండ, ఇటు రష్మిక మందన్న భారీగానే సంపాదించారు. ఇద్దరి ఆస్తుల విలువ కలిపి సుమారుగా రూ. 145 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.