BigTV English

Babies Without Pregnancy: గర్భం దాల్చకుండానే బిడ్డకు జన్మనివ్వచ్చు! పరిశోధనలో షాకింగ్ విషయాలు

Babies Without Pregnancy: గర్భం దాల్చకుండానే బిడ్డకు జన్మనివ్వచ్చు! పరిశోధనలో షాకింగ్ విషయాలు

Babies Without Pregnancy| శాస్త్రవేత్తలు ఫెర్టిలిటీ (సంతానోత్పత్తి) పరిశోధనలో అనూహ్య విజయాన్ని సాధించారు. చర్మం కణాల నుండి మానవ అండాలను సృష్టించారు. ఈ ఆవిష్కరణ ప్రపంచంలో సంతానలేమితో బాధపడే అనేక దంపతులకు కొత్త ఆశ కలిగించింది. ఈ పరిశోధన పూర్తి అయితే మానవ ప్రత్యుత్పత్తి రంగంలో ఒక విప్లవమే అవుతుంది.


పరిశోధన వివరాలు

పరిశోధకులు సాధారణ చర్మం కణాలను మానవ అండాలుగా మార్చారు. ఈ ప్రక్రియను ఇన్ విట్రో గామేటోజెనిసిస్ అంటారు. ఇది ఒక వ్యక్తి సొంత జన్యు పదార్థాన్ని ఉపయోగిస్తుంది. గర్భం దాల్చడానికి అవసరమైన అండాలను ఉత్పత్తి చేయలేని వారికి ఈ విధానం ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు సమలింగ దంపతులకు కూడా ఇది సంతానం పొందేందుకు ఉపయోగపడుతుంది.

ఎలా పని చేస్తుంది?

శాస్త్రవేత్తలు మొదట చర్మం కణ నమూనాను తీసుకుంటారు. ఈ కణం నుండి కేంద్రకాన్ని (న్యూక్లియస్) సంగ్రహిస్తారు. కేంద్రకంలో చాలావరకు జన్యు కోడ్ ఉంటుంది. ఈ కేంద్రకాన్నీ దాత అండంలోకి ప్రవేశపెడతారు. అయితే దాత అండం సొంత జన్యు పదార్థాన్ని ముందుగానే తీసివేస్తారు.


భవిష్యత్ ప్రభావం

ఈ పద్ధతి జీవజన్యు విధానంలో తల్లి లేకుండా భ్రూణాలను సృష్టించగలదు. గర్భం ధరించలేని మహిళలు కూడా తల్లులు కావచ్చు. ఇది బంధ్యత్వం (సాధారణ పద్ధతిలో పిల్లలకు జన్మనివ్వలేని వారు) ఉన్న దంపతులకు కొత్త మార్గాలను అందిస్తుంది. ఈ టెక్నాలజీ కొన్ని రకాల బంధ్యత్వాన్ని పూర్తిగా ముగించగలదు.

ఇంకా ఎంతకాలం పడుతుంది

ఈ ప్రయోగం పూర్తి కావాలంటే.. కనీసం పది సంవత్సరాలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ముందు విస్తృతమైన పరీక్షలను నిర్వహించాలి. భద్రత, ప్రభావాన్ని సంపూర్ణంగా నిరూపించాలి. జంతువుల ప్రయోగాలు విజయవంతం కాగానే మానవ ట్రయల్స్ ప్రారంభిస్తారు.

నైతిక, చట్టపరమైన అంశాలు

ఈ కొత్త టెక్నాలజీ కొన్ని కీలక, నైతిక ప్రశ్నలను లేవనెత్తుతుంది. సమాజం దాని నైతిక చిక్కులను సమగ్రంగా చర్చించాలి. అటువంటి విధానాల కోసం చట్టపరమైన చట్రాలు అవసరం. క్లినికల్ ఉపయోగానికి ముందు నియంత్రణపై చర్చించి ఆమోదం అవసరం.

పరిశోధన నేపథ్యం

ఈ అధ్యయనం నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురించబడింది. ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్శిటీ ఈ పరిశోధనను నిర్వహించింది. పరిశోధన బృందానికి డైరెక్టర్ శౌక్రాట్ మితాలిపోవ్ నాయకత్వం వహించారు. ఇది సెల్యులార్ రీప్రోగ్రామింగ్లో మునుపటి ప్రయోగాలపై ఆధారపడి ఉంటుంది.

ఈ ఆవిష్కరణ వైద్యశాస్త్రంలో పెద్ద మలుపు. ఇది బంధ్యత్వం ఉన్న మిలియన్ల దంపతులుకు ఆశ కలిపించింది. అయితే ఇంకా పరీక్షలు పూర్తికాలేదు. సమాజం నైతిక చిక్కులను పరిష్కరించాలి. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. భవిష్యత్తులో కుటుంబ నిర్మాణాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది.

Also Read: అత్యంత వృద్ధ మహిళ డిఎన్ఏలో షాకింగ్ రహస్యాలు.. ముసలితనంలోనూ యవ్వనంగా

Related News

iPhone 17 Dual Camera: ఐఫోన్ 17లో అద్భుత ఫీచర్.. ఒకేసారి ముందు వెనుక కెమెరాలతో వీడియో రికార్డింగ్

Galaxy A35 5G: గెలాక్సీ A35 5Gపై భారీ తగ్గింపు.. రూ.16000 డిస్కౌంట్.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే

Comet Browser: గూగుల్‌‌కే చెమటలు పట్టిస్తున్న ఈ అరవింద్ శ్రీనివాస్ ఎవరో తెలుసా? ఇదే భారతీయుడి పవర్!

Tablet Comparison: రెడ్మీ ప్యాడ్ 2 ప్రో vs వన్‌ప్లస్ ప్యాడ్ 3 vs శాంసంగ్ ట్యాబ్ S10 FE.. ఏ ట్యాబ్లెట్ బెస్ట్?

iPhone 16 Plus: ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ తగ్గింపు.. రూ.10000 కంటే ఎక్కువ డిస్కౌంట్.. ఎలా పొందాలంటే?

AI Dream Recorder: నిద్రలో వచ్చే కలలను వీడియోలుగా మార్చకోవచ్చు.. ఈ ఏఐ డివైజ్ గురించి తెలుసా?

Snapchat Memories: యూజర్లకు షాక్ ఇచ్చిన స్నాప్‌చాట్.. మెమొరీస్ స్టోరేజ్ ఇకపై ఫ్రీ కాదు

Big Stories

×