Anupama kher: ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌కు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. సినిమాల్లో అతడు పోషించే పాత్రలకు జనాలు ఫిదా అవుతుంటారు. ఆయన నటిస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. హిందీలో అనేక సినిమాల్లో నటించిన అనుపమ్ ఖేర్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.. తెలుగులో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమాలో నటించి తన నటనతో మెప్పించారు. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో కనిపించారు.. ఒకవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ నటుడు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.. తనకు సంబంధించిన పోస్టులను పెడుతూ అభిమానులతో ముచ్చటిస్తారు. తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ లో జరిగిన ఘటన పై డైరెక్ట్ గా X అధినేత ఎలన్ మస్క్ కు ఫిర్యాదు చేశారు. ఆయన ఎందుకు ఫిర్యాదు చెయ్యడానికి గల కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ట్విట్టర్ అకౌంట్ వాడుతుంటారు. ఆయనకు అక్కడ చాలా మందే ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఫ్యాన్స్ తో ఎప్పుడు చిట్ చాట్ చేస్తాడు. ఈ క్రమంలో అతని ఫాలోవర్స్ కొందరు మిస్ అయ్యినట్లు గ్రహించారు నటుడు. దీనిపై ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ కు ఫిర్యాదు చేశాడు.. ప్రియమైన మిస్టర్ ఎలన్ మస్క్ నేను గత 15 రోజుల్లో 900000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ను కోల్పోయాను! దానికి కారణం ఏంటో తెలుసా? లేదా మీ కంపెనీలోని ఎవరైన ఏదైన చేశారా? నాకు వివరాలు తెలియజేయ్యాలని కోరుతున్నానని అని ట్వీట్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలోనూ, అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. మరి ఈ కంప్లైంట్ పై ఎలన్ మస్క్ ఎలా స్పందిస్తారో చూడాలి..
Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ రామరాజుకు అవమానం.. అదే అతని ధైర్యం..
ఈయన 1984 లో 28 ఏళ్ల వయసులో నటుడుగా తన ప్రయాణన్ని మొదలు పెట్టారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇప్పటివరకు ఆయన దాదాపు 500 కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన వయసు 70 ఏళ్ళు ఉంటుంది. ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల తెలుగు సినిమాల్లోనూ ఎక్కువగా కనిపిస్తున్నారీ సీనియర్ యాక్టర్… ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తాను ఇప్పటివరకు నటించిన సినిమాలకు అవార్డు లను కూడా సొంతం చేసుకున్నాడు.. వందల సినిమాల్లో నటిస్తున్నాడు అంటే ఆయన క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈ వయసులో కూడా సినిమాల ను వీడలేదు.. ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నట్లు సమాచారం.. త్వరలోనే ఈయన సినిమాల గురించి అనౌన్స్ చెయ్యనున్నారని బాలీవుడ్ మీడియా వర్గాల్లో సమాచారం..
Dear Mr. @elonmusk ! I have lost more than 900000 followers in the last 15days! Will you know the reason! Or anybody in your team? By the way this is an OBSERVATION, not a COMPLAINT! Yet! 🤓
— Anupam Kher (@AnupamPKher) December 3, 2025