KL Rahul: టీమిండియా తాత్కాలిక వన్డే కెప్టెన్ కే ఎల్ రాహుల్ ( KL Rahul) రియల్ హీరోగా మారిపోయాడు. జట్టుకు ఏ కష్టం వచ్చినా ఆ పాత్రలో ఒదిగిపోతున్నాడు. ఓపెనర్, బెస్ట్ ఫినిషర్, మిడిల్ ఆర్డర్, వికెట్ కీపర్, కోహ్లీ స్థానం మూడో నెంబర్, ఓపెనర్ లేదా కెప్టెన్ కు గాయామైతే ఆ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వరుసగా సక్సెస్ కూడా అందుకుంటున్నాడు రాహుల్.
Also Read: T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్..టీమిండియా కొత్త జెర్సీ లాంచ్ చేసిన రోహిత్, తిలక్
దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ప్రస్తుతం మండే సీరియస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెడ నొప్పి గాయం కారణంగా గిల్ జట్టుకు దూరమయ్యాడు. అటు శ్రేయాస్ అయ్యర్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యా. ఇలాంటి సమయంలో టీమిండియా కు అత్యవసరంగా కెప్టెన్ అవసరం వచ్చింది. ఆ సమయంలో వెంటనే అందరికీ గుర్తుకు వచ్చిన పేరు కె.ఎల్ రాహుల్. ఇంకేముంది దక్షిణాఫ్రికా తో జరుగుతున్న వన్డేలకు కె ఎల్ రాహుల్ ను కెప్టెన్ చేశారు. దానికి తగ్గట్టుగానే కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. మొదటి మ్యాచ్ తన ఆధ్వర్యంలో విజయం సాధించింది టీమిండియా. నిన్న బౌలర్ల వైఫల్యం కారణంగా ఓడిపోయినప్పటికీ తన ప్రయత్నం మాత్రం చేశాడు.
విశాఖపట్నంలో కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు రాహుల్. ఇక మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చిన కేఎల్ రాహుల్, వికెట్లు పడుతున్నప్పటికీ రెండు మ్యాచ్ లలో 130 కి పైగా పరుగులు సాధించాడు. టీమిండియా 300కు పైగా స్కోర్ సాధించేలా కృషి చేశాడు. ఇప్పుడే కాదు, టీమిండియా కు అవసరమైనప్పుడు కీపర్ గా కూడా పనిచేస్తున్నాడు. అటు టెస్టుల్లో ఓపెనర్ గా దుమ్ము లేపుతున్నాడు. వన్డేలలో విరాట్ కోహ్లీ లేకపోతే అతని స్థానాన్ని కూడా భర్తీ చేస్తున్నాడు. బెస్ట్ ఫినిషర్ గా కూడా పేరు తెచ్చుకుంటున్నాడు.
వన్డేల్లో కెప్టెన్ గా కె.ఎల్ రాహుల్ కు మంచిది రికార్డు ఉంది. కె ఎల్ రాహుల్ మొత్తం 14 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో 9 మ్యాచ్ లో టీమిండియా గెలవగా 5 మ్యాచ్ లలో ఓడిపోయింది. అంటే 70% సక్సెస్ రేట్ తో దూసుకు వెళ్తున్నాడు రాహుల్. ఇది ఇలా ఉండగా టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటికే రెండు వన్డేలు పూర్తయ్యాయి. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే టీమిండియా ఒక మ్యాచ్ గెలవగా, రెండో వన్డేలో ఓడిపోయింది. ఇక దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మూడవ వన్డే వైజాగ్ వేదికగా జరగనుంది. డిసెంబర్ 6వ తేదీన ఈ మ్యాచ్ ఉండనుంది. ఇందులో గెలిచేటట్టుకు సిరీస్ రానుంది.
Also Read: Mohammed Shami: బట్టతలకు చెక్..ఆ అమ్మాయితో మహమ్మద్ షమీ ఎ*ఫైర్ ?