E-Paper
Advertisement

Mirai: AI కాదు.. రాముడి పాత్రలో నటించింది ఈయనే.. టీమ్ క్లారిటీ!

Mirai: AI కాదు.. రాముడి పాత్రలో నటించింది ఈయనే.. టీమ్ క్లారిటీ!
Advertisement

Mirai:చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. ‘ఓ బేబీ’ సినిమాతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు తేజా సజ్జా(Teja sajja). ఆ తర్వాత ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన ‘జాంబిరెడ్డి’ సినిమాతో హీరోగా మారి.. అదే దర్శకుడి దర్శకత్వంలో ‘హనుమాన్’ సినిమా చేసి సూపర్ హీరో కాన్సెప్ట్ తో పాన్ ఇండియా హీరోగా పేరు దక్కించుకున్నారు. ఇప్పుడు సూపర్ యోధ పాత్రలో సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా.. తొలి పరిచయంలో చేసిన చిత్రం మిరాయ్. తన అద్భుతమైన నటనతో స్టార్ సెలబ్రిటీల దర్శకుల మన్ననలు కూడా సొంతం చేసుకున్నారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. అంతే రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకుపోతోంది.

మిరాయ్ క్లైమాక్స్ లో ఆకట్టుకున్న రాముడు పాత్ర..

రితికా నాయక్ హీరోయిన్ గా.. శ్రియా శరణ్, జగపతిబాబు కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా.. కృతి ప్రసాద్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ఈ సినిమా క్లైమాక్స్ లో శ్రీరాముడు రిఫరెన్స్ చూపించడం ప్రేక్షకులకు బాగా నచ్చినట్లు అనిపిస్తోంది. నిజానికి ఈ పాత్రలో ప్రభాస్ నటించారు అంటూ మూవీ విడుదలకు ముందు పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. దీనికి తోడు ఏ ఐ టెక్నాలజీని ఉపయోగించి ప్రభాస్ ను ఇక్కడ క్రియేట్ చేశారు అంటూ కూడా వార్తలు వినిపించాయి. కానీ అంత ఉట్టిదే అంటూ అసలు విషయాన్నీ బయటపెట్టింది చిత్రబృందం

Advertisement

ఆ రాముడు ఎవరంటే?

సినిమా క్లైమాక్స్ లో కనిపించి కనిపించని ఆ రాముడి పాత్రను ఒక యువ నటుడితో చేయించారు. దీంతో అతడు ఎవరు? అతడు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంటూ ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఆ యువ నటుడి పేరు గౌరవ్ బోరా(Gaurav Bora).. ఈయన హిందీ నటుడు.. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ కి చెందినవారు. మాస్ కమ్యూనికేషన్ పూర్తిచేసిన ఈయన.. నటనపై ఇష్టంతోనే ఢిల్లీకి వచ్చి థియేటర్ గ్రూపులో చేరి.. ఐదేళ్లపాటు పలు నాటకాలు కూడా చేశారు. అంతేకాదు కొన్ని కమర్షియల్ యాడ్స్ లో నటించిన ఈయన.. షార్ట్ ఫిలిమ్స్ ,హిందీ సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు..

Advertisement

ALSO READ:Nani: ఆశకు పోయి మిరాయ్ ఛాన్స్ మిస్ చేసుకున్న నాని.. ఎంత పని చేశావ్ భయ్యా!

హిందీ నటుడైనా బాగా మెప్పించాడు…

అలా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న గౌరవ్ బోరాను ఈ సినిమాలో రాముడి పాత్ర కోసం కార్తీక్ ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. అంతేకాదు రెండు రోజులపాటు ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. దీనికి తోడు ఈ శ్రీరాముడు పాత్రకు కాస్త వీఎఫ్ఎక్స్ ఎలిమెంట్స్ జోడించేసరికి ఆ సన్నివేశాలు మరింత ఆసక్తిగా అనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే తెలుగు చిత్రాలలో హిందీ నటుడికి రాముడు పాత్ర ఇచ్చి ఇంకో నటుడితో పోలిక లేకుండా చేశారు అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

అందుకే హిందీ నటుడిని తీసుకున్నారు..

వాస్తవానికి తెలుగు చిత్రాలలో శ్రీరాముడి పాత్ర అంటే వెంటనే దివంగత నటులు సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. ఆయన తర్వాత ఆ రేంజ్ లో మెప్పించిన నటుడు మరొకరు లేరు అనడంలో సందేహం లేదు. అందుకే అంత గొప్ప నటుడిని ఇక్కడ రీ క్రియేట్ చేయలేక ఇలా హిందీ నటుడిని తీసుకొచ్చి డైరెక్టర్ మేనేజ్ చేశాడు అని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు ఈ రాముడు పాత్ర మాత్రం ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది అని చెప్పవచ్చు.

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×