 
					Nani: మిరాయ్ .. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఇందులో నటించిన నటీనటులకు కూడా మంచి గుర్తింపును అందించింది. ఇతిహాస కథకు యాక్షన్ అడ్వెంచర్ జోడించి.. వినూత్నమైన విజువల్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) ఇందులో సూపర్ యోధ పాత్రలో నటించగా.. రితిక (Ritika Nayak) ఒక ఉద్దేశం కోసం పనిచేసే అమ్మాయి పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయింది..
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కృతి ప్రసాద్ సహనిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం వరుస కలెక్షన్స్ తో థియేటర్లలో జోరు చూపిస్తున్న ఇంత మంచి సినిమాని ప్రముఖ హీరో నాని (Nani )మిస్ చేసుకున్నారని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కథను కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) తొలిసారి నేచురల్ స్టార్ నాని కి వినిపించారట.
ఆశకు పోయి గొప్ప ఛాన్స్ వదులుకున్న నాని..
కథ విన్న వెంటనే నాని కూడా ఒప్పుకున్నారు. కానీ రెమ్యూనరేషన్ విషయంలో విభేదాలు రావడంతోనే ఆయన ఈ సినిమాని వదులుకున్నారు అంటూ సినీ వర్గాలు చెబుతున్నా.. ఇక దాంతో చేసేదేమీ లేక.. డైరెక్టర్ తేజకు కథ చెప్పగానే.. తేజ వెంటనే ఒప్పేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాని అభిమానులు మాత్రం కాస్త నానిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆశకు పోయి గొప్ప ఛాన్స్ వదులుకున్నావు కదా భయ్యా అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం ..అయితే ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
ALSO READ:Dhanush: ఇడ్లీ తినడానికి కూడా డబ్బుల్లేవు.. నాటి బాధలు గుర్తుచేసుకున్న ధనుష్!
నటుడు గానే కాదు నిర్మాతగా కూడా సక్సెస్..
నాని విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకవైపు హీరోగా.. మరొకవైపు నిర్మాతగా దూసుకుపోతున్న ఈయన.. ఇటీవలే కోర్ట్ మూవీని నిర్మించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ది ప్యారడైజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాలో మోహన్ బాబు (Mohan Babu) కూడా నటిస్తున్నట్లు ఇటీవల మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించేసింది. భారీతారాగణంతో రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ది ప్యారడైజ్ సినిమా విశేషాలు..
ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో వస్తున్న రెండవ సినిమా కావడంతో అటు అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి . ఇకపోతే డ్రాగన్ సినిమాతో ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ అందుకున్న కాయాదులోహర్ (Kayadu Lohar) ఇందులో హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. రాఘవ్ జుయాల్, బాబు మోహన్ కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు.