Nidhhi Agerwal: ఇండస్ట్రీలో సక్సెస్ దక్కాలి అంటే హార్డ్ వర్క్ తో పాటు కొద్దో గొప్పో లక్ ఉండాలి అని అంటారు. అది నిధి అగర్వాల్ విషయంలో అక్షరాలా నిజం అయ్యింది అని అంటున్నారు నెటిజన్స్. అందం, అభినయం ఉన్న నిధి.. సవ్యసాచి సినిమాతో తెలుగునాట అడుగుపెట్టింది. మొదటి సినిమాలోనే గ్లామర్ ఒలకబోసి కుర్రాకారు కంట పడ్డ భామ అవకాశాలను అందుకుంది కానీ విజయాలను దక్కించుకోలేకపోయింది.
ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్ని అందుకున్నా కూడా అమ్మడికి ఆశించిన సక్సెస్ దక్కలేదు. దీంతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ అలా కాలం వెళ్లదీస్తూ వచ్చింది. ఆ సమయంలోనే నిధి పంట పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో ఛాన్స్ పట్టేసింది. ఇక దీంతో అమ్మడి రేంజ్ మారిపోతుంది అని అనుకున్నారు. కానీ, నిధి అదృష్టం ఏ మాత్రం కలిసిరాలేదు.
హరిహర వీరమల్లు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో నిధి పాపను పట్టించుకోవడం మానేశారు. కానీ, ఏ మాటకు ఆ మాట వీరమల్లులో అమ్మడి సాంగ్స్ కు మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయ్యారు అంటే అతిశయోక్తి కాదు. సరే ఈ సినిమా పోతే పోయింది.. మిరాయ్ లాంటి పాన్ ఇండియా సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది కదా అనుకుంటే.. కథను డిస్టర్బ్ ను చేస్తున్నాయని సాంగ్స్ మొత్తాన్ని లేపేశారు మేకర్స్. లేకపోతే హిట్ సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే మాములు విషయం కాదు.
ఇప్పుడు స్టార్ హీరోయిన్లు మరింత గుర్తింపు తెచ్చుకోవడానికి స్టార్ హీరోల సినిమాల్లో ఐటెంసాంగ్స్ చేస్తున్నారు. నిధి కూడా అలాగే మిరాయ్ లో ఒక సాంగ్ చేసింది. ట్రైన్ లో ఫైట్ సీన్ కన్నా ముందు ఈ సాంగ్ ఉండేది. ఆర్య సినిమాలో అ అంటే అమలాపురం సాంగ్ లా ప్లాన్ చేశారట. కానీ, కొన్ని కారణాల వలన ఆ సాంగ్ తీసేశారు. ఆ సాంగ్ హిట్ అయితే నిధి రేంజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళేది. ఈ సాంగ్ సెకండ్ పార్ట్ లో పెట్టనున్నట్లు మేకర్స్ తెలిపారు. కనీసం ఓటీటీలో కూడా రిలీజ్ చేయమని చెప్పడం బాధాకరం. ఇది కూడా ఆమె బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుతం నిధి ఆశలన్నీ ప్రభాస్ పైనే పెట్టుకుంది. డార్లింగ్ హీరోగా తెరకెకెక్కిన ది రాజాసాబ్ లో నిధి ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అమ్మడి పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా ది రాజా సాబ్ రిలీజ్ అవుతోంది. దానికోసమే నిధి వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది. కనీసం ఈ సినిమా అయినా అమ్మడికి ఆ బ్యాడ్ లక్ ను తొలగిస్తుందో లేదో చూడాలి.