E-Paper
Advertisement

ఎయిర్ ఇండియా సూపర్ న్యూస్.. ఢిల్లీ-టొరంటో మధ్య ఇక నాన్‌స్టాప్ ఫ్లైట్!

ఎయిర్ ఇండియా సూపర్ న్యూస్.. ఢిల్లీ-టొరంటో మధ్య ఇక నాన్‌స్టాప్ ఫ్లైట్!
Advertisement

Delhi Toronto Non Stop Flight: భారత్ నుంచి కెనడాకు ప్రయాణించే వారికి ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 1 నుంచి ఢిల్లీ–టొరంటో మార్గంలో అత్యాధునిక బోయింగ్ 787-9 విమానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త విమానం అందుబాటులోకి రావడంతో.. ప్రస్తుతం వియన్నాలో ఫ్యూయల్ ఫిల్లింగ్ బ్రేక్ అవసరం లేకుండా నాన్‌ స్టాప్ సర్వీస్ అందించనుంది.

భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం

ఢిల్లీ నుంచి టొరంటో వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఇప్పటి వరకు ఇంధనం నింపేందుకు మధ్యలో ఆగాల్సి రావడంతో మొత్తం ప్రయాణానికి దాదాపు 20 గంటలు పట్టేది. కొత్త నాన్‌స్టాప్ సర్వీస్‌తో ఈ సమయం సుమారు 17 గంటలకు తగ్గనుంది. అంటే, ప్రయాణికులు దాదాపు మూడు గంటల సమయాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. టొరంటో నుంచి ఢిల్లీకి వచ్చే విమానం కూడా సుమారు 16 గంటల్లో నాన్‌ స్టాప్‌ గా గమ్యస్థానానికి చేరుకోనుంది.

ఇక టొరంటోకు రెగ్యులర్ సర్వీస్

Advertisement

అటు ఎయిర్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వారానికి ఐదు రోజులే నడుస్తున్న ఢిల్లీ–టొరంటో సర్వీసును ఆగస్టు 1 నుంచి ప్రతిరోజూ నడపనుంది. దీంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే వారికి మరిన్ని ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల పెరిగిన ఇంధన ధరలు, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల ప్రభావంతో 2026 జూన్, జూలై నెలల్లో ఈ మార్గంలో విమానాల సంఖ్యను ఎయిర్ ఇండియా తాత్కాలికంగా తగ్గించింది. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడటంతో మళ్లీ రోజువారీ సర్వీసులను ప్రారంభిస్తోంది.

కొత్త బోయింగ్ 787-9 విమానం భారత్–కెనడా మధ్య ప్రయాణించే వారికి మరింత మెరుగైన ఎక్స్ పీరియెన్స్ అందిస్తుందని ఎయిర్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. కెనడాలో ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ ప్రవాస సమాజాల్లో ఒకటి నివసిస్తోందని, అందుకే టొరంటో అత్యంత కీలకమైన అంతర్జాతీయ గమ్యస్థానాల్లో ఒకటిగా కొనసాగుతోందన్నారు.

తొలిసారిగా ప్రీమియం ఎకానమీ క్లాస్‌

Advertisement

కొత్త బోయింగ్ 787-9 విమానంలో మూడు క్లాస్ ల క్యాబిన్ ఉంటుంది. ఇందులో బిజినెస్ క్లాస్, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ క్లాస్ ప్రయాణ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఢిల్లీ–టొరంటో మార్గంలో తొలిసారిగా ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ విమానంలో మొత్తం 30 బిజినెస్ క్లాస్ సూట్లు, 28 ప్రీమియం ఎకానమీ సీట్లు, 238 ఎకానమీ సీట్లు ఉంటాయి. బిజినెస్ క్లాస్‌లో పూర్తిగా ఫ్లాట్ బెడ్, వైర్‌ లెస్ ఛార్జింగ్, వ్యక్తిగత స్టోరేజ్, 17 అంగుళాల 4K టచ్‌స్క్రీన్ లాంటి ప్రీమియం సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ప్రీమియం ఎకానమీలో విశాలమైన సీట్లు, ఎక్కువ లెగ్‌ రూమ్, 13.3 అంగుళాల డిస్‌ ప్లే ఇవ్వనున్నారు. ఎకానమీ క్లాస్‌లో కూడా కొత్త డిజైన్ సీట్లు, 11.6 అంగుళాల 4K టచ్‌స్క్రీన్, మొబైల్ పరికరాల కోసం ప్రత్యేక హోల్డర్లు ఏర్పాటు చేశారు. ఈ కొత్త బోయింగ్ 787-9 విమానానికి సంబంధించిన టికెట్లను ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, కస్టమర్ కేర్ సెంటర్, ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. కొత్త సర్వీసులతో భారత్–కెనడా మధ్య ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యవంతంగా మారనుంది.

Read Also: దుబాయ్ బంపర్ ఆఫర్.. టూర్ కు వెళ్లండి.. కళ్లు చెదిరే బహుమతలు పొందండి!

Related News

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓలా, ఉబర్‌లోనే.. సిటీ బస్సుల లైవ్ లొకేషన్!

నీళ్లు తాగకుండానే.. జీవితాంతం బతికేసే 6 వింత జంతువులు.. ఇదేం విచిత్రం సామీ!

రైలులో చైన్ ఎప్పుడు లాగాలి? చట్టం ఏం చెబుతోంది? దుర్వినియోగం చేస్తే పరిస్థితేంటి!

ట్రైన్ కాదు.. నడిచే 5-స్టార్ హోటల్.. ఈ రష్యా రైలును చూస్తే షాక్ అవ్వాల్సిందే!

టోకెన్ ఉన్నా లేకపోయినా రూ. 10 లక్షల ఇన్సూరెన్స్.. టీటీడీ సంచలన నిర్ణయం!

మళ్లీ పట్టాలెక్కనున్న భారత్-బంగ్లాదేశ్ రైళ్లు.. 2 ఏళ్ల తర్వాత ఇరు దేశాల కీలక నిర్ణయం!

నల్లగొండలో హైటెక్ బస్టాండ్.. ఏకంగా రూ. 54 కోట్లతో నిర్మాణం!

హోస్టెస్, వైఫై, టాయిలెట్.. ఈ ఆర్టీసీ బస్సును చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Big Stories

Advertisement
×