E-Paper
Advertisement

NoraFatehi : బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి కారుకు ప్రమాదం.. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే..?

NoraFatehi : బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి కారుకు ప్రమాదం.. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే..?
Advertisement

NoraFatehi : బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కారుకు ప్రమాదం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలోని ఓ మ్యూజిక్ ఈవెంట్ లో పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి వెళ్తున్న నోరా కారు పెద్ద రోడ్డు వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. వేగంగా వచ్చిన మరోకారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలు తగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం గురించి వెంటనే సమాచారం అందుకున్న ముంబై పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. చిన్న గాయాలు కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తుంది.. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఈ వార్త వైరల్ అయింది.. ఈ న్యూస్ వినగానే ఆమె అభిమానులు టెన్షన్ పడుతున్నారు.. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉంది. పెద్ద ప్రమాదం ఏమి లేదు కదా అని అరా తీసుకున్నారు. ఆమె పరిస్థితి ఎలా ఉంది అనేది తెలియాల్సి ఉంది.

నోరా ఫతేహి కారుకు పెద్ద ప్రమాదం.. 

బాలీవుడ్ ముద్దుగుమ్మ నోరా ఫతేహి కారుకు పెద్ద ప్రమాదం జరిగింది. ముంబైలోని ఓ మ్యూజిక్ ఈవెంట్ కు ఆమె తన కారులో వెళ్తుంది. ఈ క్రమంలో మరో కారు తన కారును బలంగా ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న నోరాకు తీవ్ర గాయాలు అయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రమాదానికి గురైన కారు బాగా డ్యామేజ్ అయినట్లు ఫోటోలను చూస్తే అర్థమవుతుంది. అయితే ఆమె తల కారు అద్దానికి తగలడంతో తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు. ఆ కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందువల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇక హీరోయిన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.. అదృష్టవ శాత్తు ఆమె చిన్నగాయాలతో బయటపడింది.. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

 నోరా ఫతేహి సినిమాల విషయానికొస్తే.. 

Advertisement

బాలీవుడ్ ముద్దుగుమ్మ నోరా తెలుగులో ‘బాహుబలి’లో ‘మనోహారి’ సాంగ్‌లో కవ్వించింది.. ఐటెం సాంగ్స్ చాలానే చేసింది. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో ఓ పాటలో కనిపించింది. ఒకవైపు తెలుగు సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తూనే… మరోవైపు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు ఈమె ఈమధ్య డాన్స్ షోల్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ అమ్మడు సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగోడుతుంది.. ప్రస్తుతం ఆమెకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×