E-Paper
Advertisement

iPhone 17 Discount: ఒకటి రెండు కాదు, మూడు కొత్త ఐఫోన్‌లపై భారీ ధర తగ్గింపు.. కొనేందుకు ఎగబడుతున్న జనం

iPhone 17 Discount: ఒకటి రెండు కాదు, మూడు కొత్త ఐఫోన్‌లపై భారీ ధర తగ్గింపు.. కొనేందుకు ఎగబడుతున్న జనం

iPhones Discount| భారత్‌లో హాలిడే షాపింగ్ సీజన్ మొదలైంది. ఆన్‌లైన్ మార్కెట్‌లో దాదాపు అన్ని ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ పై భారీ కొనుగోళ్లు జరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి ఈ పండుగ సమయంలో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఆపిల్ ఫ్యాన్స్‌కు ఈ ఆన్‌లైన్ ఆఫర్లు చాలా లాభదాయకంగా ఉన్నాయి. ఈ ఆఫర్స్ లో ఏకంగా మూడు కొత్త ఐఫోన్స్ పై భారీ డిస్కౌంట్ తో అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్ 17పై భారీ బ్యాంక్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 17కు మంచి డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. 256GB వేరియంట్ అధికారిక ధర రూ.82,900. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే.. రూ.4,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రధాన బ్యాంకుల కార్డులకు ఇది వర్తిస్తుంది. పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేస్తే మరింత తగ్గింపు వస్తుంది. ఎక్స్‌చేంజ్ ఫోన్ కండీషన్ మీద ఫైనల్ ధర ఆధారపడి ఉంటుంది.

ఐఫోన్ 17 ఫీచర్లు, పనితీరు

ఐఫోన్ 17లో ప్రీమియం డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. రెండు 48MP సెన్సార్లు ఉన్నాయి. స్పష్టమైన ఫోటోలు, మెరుగైన లో-లైట్ పనితీరు లభిస్తాయి. ఆపిల్ A19 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. స్మూత్ పనితీరు, మల్టీటాస్కింగ్ సులభం. సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. ఇది వైబ్రంట్ కలర్లు, ఎక్కువ బ్రైట్‌నెస్ ఇస్తుంది.

ఐఫోన్ 16 ధర ఎంత తగ్గింది?

ఆపిల్ ఐఫోన్ 16 కూడా ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు దొరుకుతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో 128GB వేరియంట్ రూ.62,999కు అందుబాటులో ఉంది. అయితే దీని లాంచ్ ధర రూ.79,900. అంటే దాదాపు రూ.17000 డైరెక్ట్ డిస్కౌంట్. ఈ ధర తగ్గింపు ఇప్పుడు చాలా ఆకర్షణీయమైన డీల్. SBI క్రెడిట్ కార్డులపై రూ.4,000 వరకు డిస్కౌంట్ ఉంది. ఎలిజిబుల్ కార్డులకు మాత్రమే వర్తిస్తుంది.

ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు, కెమెరా

ఐఫోన్ 16 ఆపిల్ A18 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వేగవంతమైన పనితీరు, పవర్ ఎఫిషియెన్సీ లభిస్తాయి. సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. అద్భుతమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ప్రధాన కెమెరా 48MP సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా. వివరమైన ఫోటోలు, వైడ్-యాంగిల్ షాట్స్ తీయవచ్చు.

Also Read: బ్యాంక్‌లో డబ్బులు లేకపోయినా యుపిఐ పేమెంట్.. గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్

ఐఫోన్ 16 ప్రోపై ప్రీమియం డిస్కౌంట్

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో కూడా డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,14,999కు లిస్ట్ అయింది. ఒరిజినల్ ధర రూ.1,34,900. స్పెషల్ సేల్ ఆఫర్లతో గణనీయంగా సేవింగ్స్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, SBI కార్డులపై రూ.4,000 వరకు అదనపు డిస్కౌంట్ ఉంది.

ఐఫోన్ 16 ప్రో హై-ఎండ్ ఫీచర్లు

ఐఫోన్ 16 ప్రోలో 256GB స్టోరేజ్ ఉంది. ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఫ్లాగ్‌షిప్ లెవెల్ పనితీరు, ఎఫిషియెన్సీ లభిస్తాయి. ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. 48MP ప్రధాన సెన్సార్, 48MP అల్ట్రా-వైడ్, 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్. అడ్వాన్స్‌డ్ జూమ్ ఫోటోగ్రఫీ సాధ్యం.

ఈ ఐఫోన్ డీల్స్ ఎందుకు ముఖ్యం?

పండుగ డిస్కౌంట్ల వల్ల ప్రీమియం ఫోన్‌లు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి. బ్యాంక్ ఆఫర్లతో భారీగా సేవింగ్స్ చేయవచ్చు. ఎక్స్‌చేంజ్ డీల్స్ ధరను మరింత తగ్గిస్తాయి. తాజా ఆపిల్ డివైస్‌లు కావాలనుకునేవారికి ఇది బెస్ట్ అవకాశం.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×