Shraddha Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో ఈమె ప్రభాస్ నటించిన సాహో సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. బాలీవుడ్ లో ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హెట్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఈమెతో పాటి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సీనియర్ హీరోయిన్ల అందరూ పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూ సినిమాలు చేస్తూ వస్తున్నారు.. శ్రద్ధ కపూర్ వయసు 38 సంవత్సరాలు. కొన్ని రోజులుగా ఈమె ఓ రచయితతో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ పెళ్లి గురించి స్పందించింది.. మరి పెళ్లెప్పుడు చేసుకుంటుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బాలీవుడ్ లో వరుస చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ పెళ్లిపై ఇప్పటికే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పెళ్లి చేసుకుందని ఓ వార్త సోషల్ మీడియాని షేర్ చేసింది.. కానీ ఇప్పుడు రచయిత రాహుల్ మోదీతో ప్రేమాయణం నడుపుతోందని టాక్.. అయితే దీనిపై ఎక్కడ వీళ్ళు స్పందించలేదు కానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇకపోతే సోషల్ మీడియాలో జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్స్ చేసింది శ్రద్ధా.. ఆ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. అందులో లవ్- బ్రేకప్ గురించి మాట్లాడింది. ఇది చూసిన నెటిజన్లు.. మీ పెళ్లి సంగతేంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు స్పందించిన శ్రద్ధ నేను పెళ్లి చేసుకుంటాను అని సమాధానం ఇచ్చింది.. ఆమె సమాధానం విని ఆశ్యర్యపోయిన అభిమానులు.. పెళ్లెప్పుడు? అని ఆరా తీస్తున్నారు.. అయితే శ్రద్ధ కపూర్ ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. మరి దీనిపై ఈమె స్పందించి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి..
Also Read : ‘లక్ష్మీ నివాసం’ యాక్టర్ అంతర కు తెలుగులో ఛాన్స్ అందుకే వచ్చిందా..?
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆయన శ్రద్ధ కపూర్.. తెలుగులో ప్రభాస్ సరసన సాహో మూవీలో నటించింది.. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఈమె చివరగా స్త్రీ 2 సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు తుంబాడ్ సినిమా ప్రీక్వెల్ పహడ్‌పాంగిర మూవలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే స్త్రీ 3, భేడియా 2 వంటి సినిమాలల్లో కూడా నటిస్తుంది.. అలాగే ఈతా మూవీ లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు అభిమానులతో ఎప్పుడు చర్చ చేస్తూ తన విషయాలను షేర్ చేస్తుంది. మరి ప్రస్తుతం ఈమె పెళ్లి గురించి అటు బాలీవుడ్ లోనూ.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ చెప్పబోతుందేమో చూడాలి..