E-Paper
Advertisement

Yamaha RayZR: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. యమహా నుంచి అదిరిపోయే హైబ్రిడ్ స్కూటర్!

Yamaha RayZR: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. యమహా నుంచి అదిరిపోయే హైబ్రిడ్ స్కూటర్!
Advertisement

Yamaha RayZR 125 2026: యువతను ఆకట్టుకునే అద్భుతమైన బైకులు, స్కూటర్లు అందుబాటులోకి తీసుకురావడంలో యమహా ముందుంటుంది. అలాంటి వాటిలో ఒకటి యమహా రే ZR 125 స్కూటర్. తక్కువ ధర, మంచి మైలేజ్, సూపర్ స్టైల్ తో ఆకట్టుకుంది.

యమహా రే ZR 125 ధర

యమహా రే ZR 125 ధర వేరియంట్ ఆధారంగా మారుతుంది. రే ZR 125 డ్రమ్ హైబ్రిడ్ ధర రూ. 76,235 నుంచి ప్రారంభమవుతుంది. ఇతర వేరియంట్లు అయిన రే ZR 125 డిస్క్ ధర రూ. 82,844, రే ZR 125 డిస్క్ రేసింగ్ బ్లూ, డార్క్ మాట్టే బ్లూ ధర రూ. 83,744, రే ZR 125 స్ట్రీట్ ర్యాలీ హైబ్రిడ్ ధర  రూ. 88,425 నుంచి ప్రారంభం అవుతుంది. ఆన్ రోడ్ ధరలు మరికాస్త ఎక్కువగా ఉంటుంది.

Advertisement

యమహా రే ZR 125 అనేది 4 వేరియంట్లలో, 12 రంగులలో అందుబాటులో ఉంది. యమహా రే ZR 125 125cc BS6 ఇంజిన్‌తో శక్తిని కలిగి ఉంటుంది. ఇది 8.04 bhp శక్తిని, 10.3 Nm టార్క్‌ ను ప్రొడ్యూస్ చేస్తుంది. యమహా రే ZR 125 డ్రమ్, డిస్క్ బ్రేకులతో వస్తుంది. రే ZR 125 స్కూటర్ 99 కిలోల బరువు, 5.2 లీటర్ల  ప్యూయెల్ ట్యాంక్ ను కలిగి ఉంటుంది.  ఈ హైబ్రిడ్ ఇంజిన్ బ్యాటరీతో కలిసి పనిచేస్తుంది. ఇది గతంలో మోడల్ తో పోల్చితే 30 శాతం ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 16 శాతం ఎక్కువ మైలేజీని పొందడంలో సహాయపడుతుంది.

యమహా రే ZR 125 స్పెసిఫికేషన్లు

యమహా రే ZR 125 అనేది స్పోర్టీ హైబ్రిడ్ ఇంజిన్ బేస్డ్ స్కూటర్. ఇది యంగ్ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించింది. స్టాండర్డ్ ట్రిమ్ రగ్డ్ లుక్ లో కనిపిస్తుంది.  స్ట్రీట్ ర్యాలీ ట్రిమ్ నకిల్ గార్డులతో మరింత అందంగా కనిపిస్తుంది. ఈ స్కూటర్ మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. Y-కనెక్ట్ స్మార్ట్‌ ఫోన్ అప్లికేషన్‌తో పనిచేసే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఈ యాప్‌లో ఫ్యూయెల్ ట్రాకర్, మెయింటెనెన్స్ ఇండియేషన్స్, రివ్స్ డాష్‌ బోర్డ్, రైడర్ ర్యాంకింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. బ్లూటూత్ ఎంపిక చేసిన వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది.

Advertisement

అన్ని వేరియంట్లలో సాధారణంగా కనిపించే ఫీచర్లలో స్మార్ట్ మోటార్ జనరేటర్ వ్యవస్థను ఉపయోగించి అదనపు థ్రస్ట్‌ ను అందించే ఇంటెలిజెంట్ పవర్ అసిస్ట్ సిస్టమ్ ఉంది. అన్ని 125cc యమహా స్కూటర్లలో SMG సిస్టమ్, రైడర్ స్టాప్ నుంచి ఎత్తు ప్రాంతాలకు ఎక్కేటప్పుడు అడిషన్ లీనియర్ పవర్ ను అందించడానికి ఎలక్ట్రిక్ మోటారుగా ఎక్కువగా పని చేస్తుంది. రే ZR 125 ఆటోమేటిక్ స్టాప్, స్టార్ట్ సిస్టమ్, సైడ్ స్టాండ్, ఇంజిన్ కట్ ఆఫ్ ఫంక్షన్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా అందిస్తుంది.

సస్పెన్షన్ హార్డ్‌ వేర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, రియర్ స్ప్రింగ్‌ను కలిగి ఉంటుంది. బేస్ మోడల్‌ లోని యాంకరింగ్ సెటప్‌ లో రెండు వీల్స్ పై డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. ప్రీమియం వేరియంట్ ముందు భాగంలో డిస్క్ సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ కు రెండు ట్యూబ్ లెస్ టైర్లు ఉంటాయి.

Read Also: ఫ్రీ యాక్సెసరీస్, పదేళ్ల వ్యారెంటీ.. KTM బైక్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్ బ్రో!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×