E-Paper
Advertisement

Vikarabad News: ఎమ్మార్వో ఆఫీసు ముందు ఓ వ్యక్తి నగ్న ప్రదర్శన.. న్యాయం చేయాలంటూ డిమాండ్

Vikarabad News: ఎమ్మార్వో ఆఫీసు ముందు ఓ వ్యక్తి నగ్న ప్రదర్శన.. న్యాయం చేయాలంటూ డిమాండ్
Advertisement

Vikarabad News: మధ్యకాలంలో ఆస్తి తగాదాలు రెట్టింపు అవుతున్నాయి. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఖాళీగా ఉన్న భూమని కబ్జా చేసిన కొందరు. బలవంతంగా రాయించు కునేవాళ్లు మరికొందరు. ఇద్దరు లేదా ముగ్గురు భార్యల వ్యవహారాలతో ఇబ్బందిపడేవారు ఇంకొందరు. తాజాగా అలాంటి ఘటన ఒకటి వికారాబాద్ జిల్లాలో జరిగింది.

ఎమ్మార్వో ఆఫీసు ముందు ఓ వ్యక్తి నగ్న ప్రదర్శన

Advertisement

తమ తండ్రి ఆస్తి తమకే దక్కాలని కోరుతూ వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి నగ్న ప్రదర్శన చేశాడు. మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగిన ఈ సన్నివేశాన్ని చూసి అక్కడికి వచ్చిన స్థానికులు షాకయ్యారు. దీంతో సదరు వ్యక్తి వ్యవహారం వార్తల్లోకి వచ్చింది.

Advertisement

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన హన్మయ్య మూడేళ్ల కిందట మరణించాడు. అతడికి సర్వే నెం.42లో 7.29 ఎకరాల భూమి ఉంది. హన్మయ్యకు మొదటి భార్యకు పిల్లలు లేరు. దీంతో ఆమె సోదరి ఈశ్వరమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు.

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలో ఏం జరిగింది?

మొదటి భార్య-హన్మమ్మ భూమిని తమకు వారసత్వ హక్కుగా చేయాలంటూ చౌడాపూర్ తహసీల్దార్ ఆఫీసులో డిసెంబర్‌లో స్లాట్ నమోదు చేశారు రెండో భార్య కుమారులు. అయితే సరైన పత్రాలు లేవన్న కారణంతో వారసత్వ హక్కుగా బదిలీ చేయడం కుదరదని అధికారులు తెలిపారు. 

ఈ విషయంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తహసీల్దారు ఆఫీసు ఎదుట నగ్న ప్రదర్శనకు దిగాడు సతీష్ అనే వ్యక్తి. అదే సమయంలో హన్మయ్యకు తాను మూడో భార్య కూతుర్ని అంటూ యాదమ్మ రెవెన్యూ అధికారులను సంప్రదించింది. ఆ భూమి కోసం ఇద్దరు వ్యక్తులు క్లెయిమ్ చేయడంతో అధికారులు ఎవరికీ భూమి హక్కును బదలాయించలేదు.

ALSO READ: కాంగ్రెస్ నేత సునీల్‌కుమార్ అరెస్టు.. ఆయన్ని విచారిస్తున్న అధికారులు

న్యాయంగా భూమి తమ కుటుంబానికి చెందాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగాడు సతీష్. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి చట్టప్రకారం ఎవరు వారసులో వారికి భూమి చెందేలా తగిన నిర్ణయం తీసుకుంటామని తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఆ వ్యక్తికి సర్ది చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఈ భూమి వ్యవహారం ఆ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×