E-Paper
Advertisement

Mollywood: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫోటోలో వైరల్!

Mollywood: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫోటోలో వైరల్!
Advertisement

Mollywood:సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎప్పుడు? ఎవరు ప్రేమలో పడతారో చెప్పడం కష్టం. అలా ప్రేమలో పడ్డవారు పెళ్లి చేసుకుంటారా ? అంటే కొంతమంది మధ్యలోనే బ్రేకప్ చెప్పుకుంటే.. కొంతమంది పెళ్లి చేసుకొని అభిమానులను సంతోష పరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ ఏకంగా తన తొమ్మిది సంవత్సరాల ప్రేమకు స్వస్తి పలుకుతూ ఏడు అడుగులతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. మరి ఆమె ఎవరు ? ఆమె వివాహం చేసుకున్న వరుడు ఎవరు? అతడి బ్యాగ్రౌండ్ ఏంటి? ఇలా పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి..

సింపుల్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్..

ఈమె ఎవరో కాదు మలయాళ బ్యూటీ గ్రేస్ ఆంటోనీ (Grace Antony). తెలుగు ఆడియన్స్ కి ఈమె పెద్దగా పరిచయం లేకపోయినా ఓటీటీలో మలయాళం సినిమాలు చూసే వారికి మాత్రం బాగా సుపరిచిత్రాలు అని చెప్పవచ్చు. కుంభళంగి నైట్స్, పరంతు పో, రోర్చా, నునక్కుళి వంటి చిత్రాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే నిత్యం సినిమా షూటింగ్ లతో బిజిగా ఉండే ఈమె.. సడన్ గా ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను అంటూ ఆ ఫోటోలను పంచుకుంది. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కేవలం మెడలో తాళిపడ్డ విషయాన్ని మాత్రమే అభిమానులతో పంచుకుంది. ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా ఈమె వివాహం చేసుకున్నట్లు ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది.

Advertisement

చూడ చక్కని జంట..

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు ఈమె ఎవరిని వివాహం చేసుకుంది. ఈమె భర్త ఎలా ఉంటారు అంటూ కొంతమంది ఆరా తీయడం మొదలుపెట్టారు. ముఖాలు కనిపించకుండా గ్రేస్ ఆంటోనీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి చేసుకున్నారు అని తెలిసిన తర్వాత.. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ముఖాలు కనిపించకుండా ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. మళ్లీ తన భర్తతో ఏడడుగులు వేసిన విషయాన్ని చెబుతూ తన భర్తను కూడా అభిమానులకు పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో చూడ చక్కని జంట అంటూ అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. ఈమె వివాహం చేసుకున్న వరుడు కూడా చాలా అందంగా ఉన్నారని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Advertisement

గ్రేస్ ఆంటోనీ కెరియర్..

గ్రేస్ ఆంటోనీ అలియాస్ మేరీ గ్రేసీగా పేరు సొంతం చేసుకున్న ఈమె మలయాళం చిత్ర పరిశ్రమలో నటిస్తోంది. మోడల్ మాత్రమే కాదు శాస్త్రీయ నృత్యకారిణి కూడా.. ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఎక్కువగా మాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇక షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లలో అలరిస్తున్న ఈమె డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పేరు సొంతం చేసుకుంది.

 

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×