Eluru News: మార్కెట్‌లో బంగారం ధర ఆకాశాన్ని అంటింది. రోజు రోజుకూ ధర పెరుగుతూనే ఉంటుంది. దీన్ని గమనించిన కొందరు.. బంగారం టార్గెట్‌గా దొపిడీ, చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆడిటింగ్ చేయడానికి వచ్చానంటూ ఆ బ్రాంచ్ ఉద్యోగులను నమ్మించాడు. వారిని బయటకు పంపించి.. రెండు కిలోల బంగారంతో పరారయ్యాడు. సంచలన రేపిన ఈ ఘటన ఏలూరు జిల్లాలో వెలుగు చూసింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఏలూరు జిల్లా చింతలపూడిలోని కనకదుర్గా గోల్డ్ లోన్స్ ఆఫీసు ఘరానా మోసానికి వేదికైంది. బ్రాంచ్‌లో ఆడిటింగ్ చేయడానికి విజయవాడ ప్రధాన ఆఫీసు నుంచి ఉమా మహేశ్ వచ్చాడు. అతడు ఈ కంపెనీకి ఆడిటర్‌గా పని చేస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. మంగళవారం ఉదయం కనకదుర్గా గోల్డ్ లోన్ ఆఫీసుకు వచ్చాడు. బ్రాంచ్ మేనేజర్, క్యాషియర్, మిగతా సిబ్బందిని నమ్మించాడు.
నిజమేనని వాళ్లంతా నమ్మారు. ఖాతాదారుల తాకట్టు బంగారాన్ని పరిశీలించాలని సిబ్బందితో ఆడిటర్ చెప్పాడు. స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న 380 తులాల బంగారు ఆభరణాలను అతని ముందు పెట్టారు సిబ్బంది. బంగారాన్ని పరిశీలించిన ఆడిటర్.. వాటికి సంబంధించిన పత్రాలను పరిశీలించాడు. సాయంత్రం వేళ తనకు షుగర్ లెవెల్స్ పడిపోయాయని, కొబ్బరి నీళ్లు తీసుకురావాలని మేనేజరు చెప్పాడు.
వెంటనే క్యాషియర్‌తో కలిసి ఆయన బయటకు వెళ్లారు. ఇదే సరైన సమయమని భావించిన ఆడిటర్ మహేష్.. ఆ బంగారాన్ని తెచ్చుకున్న బ్యాగులో నింపేశాడు. అక్కడి నుంచి సైలెంట్ గా పరారయ్యాడు. అయితే ఉమా మహేష్ ని గమనించిన క్యాషియర్.. గట్టిగా కేకలు వేయడంతో స్థానికులంతా చేరుకున్నారు. బంగారం దోపిడీపై సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ALSO READ: మాట్లాడలేదని రగిలిపోయిన యువకుడు, మహిళను తగలబెట్టేశాడు
పోలీసులు వచ్చిన సిబ్బంది నుంచి వివరాలు తీసుకున్నారు. ఇదిలావుండగా బ్రాంచ్ ఆఫీసు గురించి అనేక అనుమానాలు మొదలయ్యాయి. బంగారం దోపిడీ వెనుక ఆఫీసు సిబ్బంది ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఎందుకంటే బంగారం చోరీకి గురైన వెంటనే ఆఫీసులో సైరన్ మోగలేదు.
విజయవాడ నుంచి బస్సులో వచ్చిన ఆడిటర్, బంగారం పట్టుకుని ఎక్కడకి వెళ్లాడో ఎవరికీ తెలీదు. కేవలం బస్సులో వచ్చిన వ్యక్తి భారీగా బంగారం పట్టుకుపోవడాన్ని నమ్మలేక పోతున్నారు. ఫైనాన్స్ కంపెనీలో బంగారం చోరీ అయ్యిందన్న విషయం తెలియగానే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఖాతాదారులు అక్కడికి చేరుకున్నారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగడం వారి వంతైంది. ఈ యవ్వారంలో లోతుగా వెళ్తే ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
2 కిలోల బంగారంతో పరార్.. ఏలూరు జిల్లాలో ఘరానా మోసం..
చింతలపూడి కనకదుర్గ గోల్డ్ లోన్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగి చేతివాటం
సుమారు రెండు కేజీల బంగారు ఆభరణాలు చోరీ
పోలీసులకు ఫిర్యాదు చేసిన యాజమాన్యం
నిందితుడు బస్సులో పారిపోయినట్లు సమాచారం తెలియడంతో ఆర్టీసీ బస్సులను తనిఖీ చేస్తున్న… pic.twitter.com/20WqFFTjOj
— BIG TV Breaking News (@bigtvtelugu) September 9, 2025