BigTV English

Star Hero: భార్యతో విడాకులు.. మద్యానికి బానిసైనా హీరో.. సూసైడ్ అటెంప్ట్ కూడా?

Star Hero: భార్యతో విడాకులు.. మద్యానికి బానిసైనా హీరో.. సూసైడ్ అటెంప్ట్ కూడా?

Star Hero: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎంత తొందరగా ప్రేమలో పడతారు అంతే తొందరగా విడాకులు(Divorce) తీసుకొని విడిపోవడం జరుగుతుంది. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని అనంతరం విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ జాబితాలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్(Aamir Khan) ముందు వరుసలో ఉంటారు. ఒకటి కాదు రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల మరొక నటితో కూడా ఈయన రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన అమీర్ ఖాన్ ప్రస్తుతం కెరియర్ పై వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా ఎంతో బిజీగా ఉన్నారు.


మందు తాగడం అలవాటు అయ్యింది..

ఇదిలా ఉండగా అమీర్ ఖాన్ సితారే పర్ జమీన్ కానీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అమీర్ ఖాన్ తన మొదటి భార్య రీనా(Reena)తో విడాకుల ఘటన గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. నాకు మొదటి భార్యతో విడాకులు అయ్యే వరకు మందు తాగే అలవాటు లేదని, ఫస్ట్ టైం విడాకులు తీసుకున్న రోజే తాగాననీ తెలిపారు.


ఆత్మహత్యకు ప్రయత్నించాను..

రీనాతో విడాకులైన సాయంత్రం బాగా తాగేసానని అప్పటినుంచి దాదాపు ఏడాదిన్నర పాటు ప్రతిరోజు తాగుతూనే ఉన్నాను. ఆ ఏడాదిన్నర కాలంలో ఏ రోజు కూడా మనస్ఫూర్తిగా నిద్ర పోలేదని, ఎక్కువగా తాగటం వల్ల నాకు తెలియకుండానే స్పృహ కోల్పోయి పడిపోయే వాడినని అమీర్ ఖాన్ అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఇకపోతే ఈ మద్యం మత్తులో ఓసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను అంటూ ఈయన షాకింగ్ విషయాలను బయటపెట్టారు. విడాకుల తర్వాత ఏదో కోల్పోయానని బాధ నాలో ఉంది అందుకే ఎవరిని కలవడానికి కూడా ఇష్టపడలేదు. ఇక విడాకుల సమయంలోనే నేను నటించిన లగాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కిరణ్ రావుతో విడాకులు..

ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఏదో తెలియని వెలితి నాలో ఉంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అందరూ కూడా మాన్ అఫ్ ది ఇయర్ అంటూ సంబోధించారు కానీ నాకు మాత్రం ఆ వ్యాఖ్యలు ఎగతాళి చేసినట్టే అనిపించదని అమీర్ ఖాన్ వెల్లడించారు. ఇక వీరిద్దరిది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. పెళ్లి అయిన 16 సంవత్సరాలకు ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇక ఈమెకు విడాకులు ఇచ్చిన అనంతరం నిర్మాత కిరణ్ రావు(Kiran Rao)ను 2005వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు 16 సంవత్సరాల వైవాహిక జీవితం అనంతరం వీరిద్దరూ కూడా విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ తన ఇద్దరి భార్యలకు విడాకులు ఇచ్చిన ఇప్పటికీ వారితో టచ్ లోనే ఉన్నారని తెలుస్తోంది. ఇక కిరణ్ రావుతో కలిసి ఇటీవల ఓ సినిమా నిర్మాణంలో కూడా భాగమయ్యారు. ఇక ఈయన విడాకుల తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

Also Read: Kannappa: కన్నప్పకు సీక్వెల్ కాదంటా.. ఫ్రీక్వెల్ కథ కూడా సిద్ధమేనా?

Related News

AA22xA6: అల్లు అర్జున్ మూవీలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే?

Rachitha Ram: చూడ్డానికి అమాయకంగా ఉంది కానీ, అల్లాడించింది మామ

Prabhas: క్రిస్టియన్ అమ్మాయితో లవ్ లో పడ్డ ప్రభాస్, ఇదెక్కడి ట్విస్ట్ సామి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటేనే తుఫాన్.. స్టార్ హీరో సంచలన ట్వీట్!

V.K.Naresh: రూట్ మార్చిన నరేష్.. కామెడీని వదిలేసినట్టేనా?

Shahrukh Khan: ఇక చాలు రిటైర్మెంట్ తీసుకో.. నెటిజన్ ట్రోల్ కి షారుక్ దిమ్మతిరిగే ఆన్సర్!

Big Stories

×