BigTV English

OTT Movie : కొత్త కోడలు అడుగు పెట్టినప్పటి నుంచి అపశకునాలే… ట్విస్టులతో అదరగొట్టే కన్నడ మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : కొత్త కోడలు అడుగు పెట్టినప్పటి నుంచి అపశకునాలే… ట్విస్టులతో అదరగొట్టే కన్నడ మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : ఇప్పుడు ఓటీటీలో వెబ్ సిరీస్ ల సందడి నడుస్తున్న విషయం తెలిసిందే. కొత్తరకం స్టోరీలను డిఫరెంట్ గా చూపించడానికి  తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. కంటెంట్ నచ్చితే ఇక వాటికి ఓ రేంజ్ లో వ్యూస్ వస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ ఒక కుటుంబంలో ఉండే శాపం చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇది దైవ ఆరాధన, మూఢనమ్మకాలు, గ్రామీణ సంప్రదాయాలతో కన్నడ సంస్కృతికి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతోంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


జీ 5 (ZEE5)ల

ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘అయ్యన మనే’ (Ayyana Mane). 2025లో కన్నడ భాషలో విడుదలైన ఈ సినిమాకు రమేష్ ఇందిరా దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో కుషీ రవి (జాజి), అక్షయ్ నాయక్ (దుష్యంత), మనసీ సుధీర్ (నాగలంబికే), విజయ్ శోభరాజ్, హిత చంద్రశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2025 ఏప్రిల్ 25 నుంచి జీ 5 (ZEE5) లో కన్నడ, హిందీ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. ఆరు ఎపిసోడ్‌లతో వచ్చిన ఈ సిరీస్, ఒక్కో ఎపిసోడ్ సుమారు 20 నిమిషాల రన్ టైమ్ ను కలిగి ఉంది. దీనికి IMDb లో 7.5/10 రేటింగ్‌ ఉంది.


స్టోరీలోకి వెళితే

జాజి అనే యువతి, దుష్యంత అనే వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. ఆ తరువాత ఆమె తన భర్త పూర్వికులకు చెందిన అయ్యన మనే ఇంటిలోకి అడుగుపెడుతుంది. ఈ ఇళ్ళు చిక్కమగళూరు కొండలలో ఉంటుంది. ఇది దుష్యంత నివసించే ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ హౌస్. ఇందులో దుష్యంత తల్లి నాగలంబికే , అతని సోదరులు మహేష, శివ స్వామి, సోదరి పూర్ణి ఉంటారు. జాజి అక్కడికి అడుగు పెట్టిన రోజే, ఆమె అత్తగారు అకస్మాత్తుగా కుప్పకూలి మరణిస్తుంది. ఇది ఆమెను భయాందోళనకు గురిచేస్తుంది. జాజి త్వరలోనే ఒక రహస్యం తెలుసుకుంటుంది. ఈ కుటుంబంలో ఇది వరకే ముగ్గురు కోడళ్లు ఇలాగే చనిపోయారనే విషయం ఆమెకు తెలుస్తుంది. దీంతో జాజి గందరగోళంలో పడుతుంది. ఈ మరణాలు కొండయ్య అనే కుటుంబ దైవం శాపంతో సంబంధం కలిగి ఉన్నాయని, అక్కడ ఉన్న వీళ్ళంతా నమ్ముతారు. ఈ దైవం కి చెందిన ఒక పవిత్రమైన విగ్రహం కూడా ఈ ఇంట్లోనే ఉంటుంది.

ఈ ఇంట్లో వింత సంఘటనలు, కుటుంబ సభ్యుల ప్రవర్తన జాజికి అనుమానం కలుగుతుంది. ఆమె తన భర్త దుష్యంత, అతని సోదరులు ఏవో సీక్రెట్స్ దాచిపెడుతున్నారని ఆలోచిస్తుంది. ఒక హౌస్ కీపర్ తాయవ్వ, ఒక పోలీసు అధికారి మహంతేష్ సహాయంతో ఈ మరణాల వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది జాజి. ఈ విచారణలో ఆమెకి దిమ్మతిరిగే విషయాలు తెలుస్తాయి. ఆ తరువాత స్టోరీ ఒక ఊహించని క్లైమాక్స్ తో ఎండ్ అవుతుంది. చివరికి ఆ ఇంట్లో కోడళ్ళు మాత్రమే ఎందుకు చనిపోతున్నారు ? జాజి తెలుసుకున్న సీక్రెట్స్ ఏమిటి ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని మిస్ కాకుండా చూడండి.

Read Also : పెళ్ళైనా పట్టించుకోని భర్త… రోజుకో మగాడితో ఆ లేడీ కానిస్టేబుల్ చేసే పనికి దిమ్మతిరగాల్సిందే

Related News

OTT Movie : పెళ్ళైన నెలకే భర్త మృతి… అర్ధరాత్రి అలాంటి అమ్మాయి ఇంటికి అనామకుడు… ఫీల్ గుడ్ తమిళ మూవీ

OTT Movie : కోర్టులో కచేరి… ఓటీటీలో ట్రెండ్ అవుతున్న కోర్టు రూమ్ డ్రామా… ఇంకా చూడలేదా?

OTT Movie : ఆ సౌండ్స్ వింటే ఈ దెయ్యానికి పూనకాలే… అమ్మాయి వెంటపడి అరాచకం… కల్లోనూ వెంటాడే హర్రర్ సీన్స్

OTT Movie : కళ్ళకు గంతలు… అతని కన్ను పడితే అంతే సంగతులు… క్రేజీ కొరియన్ క్రైమ్ డ్రామా

F1 OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన క్రేజీ రేసింగ్ మూవీ F1.. ఎప్పుడు?ఎక్కడంటే?

OTT Movie : ఇంటి ఓనర్లే ఈ కిల్లర్ టార్గెట్… వీడి చేతికి చిక్కారో నరకమే… క్రేజీ మలయాళ సైకో థ్రిల్లర్

Big Stories

×