BigTV English

Manchu Vishnu: కన్నప్పకు సీక్వెల్ కాదంటా.. ఫ్రీక్వెల్ కథ కూడా సిద్ధమేనా?

Manchu Vishnu: కన్నప్పకు సీక్వెల్ కాదంటా.. ఫ్రీక్వెల్ కథ కూడా సిద్ధమేనా?

Manchu Vishnu: సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి నేపథ్యం ఉన్న కుటుంబాలలో మంచు కుటుంబం(Manchu Family) కూడా ఒకటి. మోహన్ బాబు(Mohan Babu) ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సిద్ధం చేసుకున్నప్పటికీ ఆయన వారసులు మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చినా అనుకున్న స్థాయిలో గుర్తింపు పొందలేకపోయారు. ఇక మంచు విష్ణు గత కొంతకాలంగా పలు ప్రయోగాత్మక సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్ మాత్రం అందుకోలేకపోయారు. ఈసారి ఎలాగైనా ఇండస్ట్రీలో హిట్ అందుకోవాలనే కసితో ఈయన కన్నప్ప అనే మైథాలజీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దాదాపు పది సంవత్సరాలు పాటు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.


జూన్ 27వ తేదీ విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది . అయితే ఇటీవల కాలంలో ఏదైనా ఒక సినిమా మంచి సక్సెస్ అయితే వెంటనే ఆ సినిమాకు సంబంధించి సీక్వెల్ లేదా ఫ్రీక్వెల్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక కన్నప్ప సీక్వెల్ గురించి కూడా మంచు విష్ణుని ప్రశ్నించడంతో సినిమా ఫలితాన్ని బట్టి తదుపరి ఏం చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంటామని సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో తెలియజేశారు. అయితే తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ కాకుండా ఫ్రీక్వెల్ (Prequel)తీయాలని ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే కథ కూడా సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

తిన్నడి పాత్ర పై…


కన్నప్ప సినిమా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందిన ఓ దర్శకుడు మంచు విష్ణుకి బంపర్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది. కన్నప్ప ఫ్రీక్వెల్ సినిమా గురించి మంచు విష్ణుతో మాట్లాడుతూ.. కన్నప్ప సినిమా అతనికి బాగా నచ్చడంతో ఆయన మంచు విష్ణు దగ్గరకు వెళ్లి తిన్నడి గురించి మాత్రమే ఒక సినిమా చేద్దాము అంటూ విష్ణుతో చెప్పినట్లు వెల్లడించారు.ఐతే స్క్రిప్టు రెడీ అయితే చూద్దాం అన్నానని.. ఒకవేళ కన్నప్ప ఫ్రాంఛైజీలో ఇంకో సినిమా చేయాలనిపిస్తే ఇదే చేస్తానని విష్ణు హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది.

ప్రభుదేవా దర్శకత్వంలో..

ఇలా కన్నప్ప సినిమా ఫ్రీక్వెలల్ చేస్తే ఏ నేపథ్యంలో చేయాలనే విషయం గురించి కూడా డైరెక్టర్ చెప్పడంతో విష్ణు కూడా సానుకూలంగానే ఉన్నారని తెలుస్తోంది. వెంటనే కాకపోయినా కొంచెం ఆలస్యమైనా కూడా ఈ ఫ్రీక్వెల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టం అవుతుంది. ఇక మంచు విష్ణు తదుపరి సినిమా గురించి కూడా ఒక వార్త సోషల్ మీడియాలోచక్కర్లు కొడుతుంది. కన్నప్ప తర్వాత ఈయన కమర్షియల్ సినిమాలో నటించాలని భావిస్తున్నట్టు సమాచారం అయితే ఈ సినిమాకు ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా (Prabhudeva)దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. ఇక ప్రభుదేవా కేవలం డాన్స్ కొరియోగ్రాఫర్ మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా పలు సినిమాలకు పని చేసిన సంగతి తెలిసిందే. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి వంటి సినిమాలకు ఈయన డైరెక్టర్ గా పని చేశారు.

Also Read: Vishwambhara: మెగా ఫాన్స్ కు షాక్ ఇచ్చిన విశ్వంభర.. ఆ రీ రిలీజ్ తో సరి పెట్టుకోవాల్సిందే!

Related News

Pawan Kalyan: అప్పట్లో ఇలాంటి టీమ్ ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాన్ని కాదు!

OG Concert: పవన్ కళ్యాణ్ కు ఏది ఊరికే రాదు… మనల్ని ఆపేది ఎవరు..జోష్ నింపిన పవన్!

Pawan Kalyan: సుజీత్ కు పిచ్చి పట్టుకుంది, పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వడానికి అదే కారణం

OG concert: ఓజీ రివ్యూ ఇదే..మీసం మెలేసిన తమన్…అంత కాన్ఫిడెంట్ ఏంటీ భయ్యా!

OG Movie : చంపేస్తే చంపేయండి రా… ఇలా మెంటల్ టార్చర్ పెట్టకండి, ఓజి సినిమా చిక్కులు

OG Ticket Price: రూ. కోటి పెట్టి ఓజీ టికెట్స్ కొన్న హైదరాబాద్ అభిమాని.. అది పవన్‌ స్టార్ క్రేజ్‌ అంటే..

Jacqueline Fernandez: సుప్రీం కోర్టును ఆశ్రయించిన జాక్వెలిన్!

Pawan Kalyan: ఇప్పటి వరకు ఆ రికార్డు లేని ఒకే ఒక్క హీరో పవన్‌.. OGతో సాధ్యమయ్యేనా?

Big Stories

×