Bollywood:ఆదిత్యధర్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ బాలీవుడ్ డైరెక్టర్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ‘ఉరి’ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆదిత్యధర్.. కొంతకాలం గ్యాప్ తీసుకొని ‘ధురంధర్’ సినిమాతో గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రణబీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి 1350 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి చరిత్ర తిరగరాసింది. అంతేకాదు పాకిస్తాన్లో అత్యధిక వీక్షణలు పొందిన చిత్రం గా నెట్ ఫ్లిక్స్ లో రికార్డు కూడా సృష్టించింది ఈ సినిమా.
ఇక ఈ సినిమాకి కొనసాగింపుగా ధురంధర్ 2: ది రివేంజ్ పేరిట మార్చి 19వ తేదీన ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అటు ఈ సినిమా కూడా కేవలం 12 రోజుల్లోనే 1340 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి ప్రభంజనం సృష్టిస్తోంది.. అంతేకాదు రాజమౌళి రికార్డులను కూడా చెరిపే వేసి.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తక్కువ సమయంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఈ చిత్రంతో డైరెక్టర్ ఆదిత్యధర్ పాత రికార్డులను చెరిపివేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈయనను హెచ్చరించారు మరో బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.. సినిమా ఇండస్ట్రీ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అంతే క్రూరత్వంగా ఉంటుంది అంటూ హెచ్చరిస్తూ ఒక పోస్ట్ షేర్ చేశారు.
ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా , దర్శకుడిగా తనకంటూ మంచి పేరు సొంతం చేసుకున్న వివేక్ అగ్నిహోత్రి ఆదిత్య ధర్ ను ఉద్దేశించి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధురంధర్ 2: ది రివేంజ్ సినిమా చూడడానికి కాలిఫోర్నియాలో ఉన్న నేను లాస్ ఏంజెల్స్ కి వెళ్లాను. ఈ చిత్రం ఒక మాస్టర్ పీస్.. శభాష్ ఆదిత్యధర్ ..మరొకసారి నువ్వు అద్భుతాన్ని సృష్టించావు. అసలు నిన్ను ఎలా ప్రశంసించాలో కూడా నాకు అర్థం కావట్లేదు . ఇప్పటికే చరిత్ర సృష్టించి ఎంతోమంది ప్రముఖుల మెప్పు పొందిన ఈ సినిమా గురించి ఏం చెప్పాలి.. ఎలా చెప్పాలి.. అందుకే నీతో ప్రత్యేకంగా ఫోన్లో నేను మాట్లాడుతాను.
also read:కృష్ణాష్టమికి రాబోతున్న జైలర్ 2?
ఆదిత్యధర్ నీ గోల్ ఏంటో నీకు తెలుసు దానిని సాధించుకోవడంలో నువ్వు చాలా స్పష్టంగా ఉన్నావు. అయితే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ వ్యవస్థపై కాస్త జాగ్రత్తగా ఉండు.ఇది ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అంతే క్రూరంగా కూడా ఉంటుంది.. కాబట్టి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరి ముందడుగు వేస్తే నీ భవిష్యత్తు బంగారుమయం అవుతుంది అంటూ హెచ్చరిక జారీ చేశారు వివేక్ అగ్నిహోత్రి. ఇక ప్రస్తుతం డైరెక్టర్ని ప్రశంసిస్తూనే అలర్ట్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి వివేక్ అగ్నిహోత్రి సలహా సూచనల మేరకు ఆదిత్య జాగ్రత్తగా మసులుకుంటూ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.