E-Paper
Advertisement

కేసీఆర్ హయాంలో మీరే లేఖ రాశాలు.. నేడు హామీ నిలబెట్టుకోండి, సీఎం రేవంత్‌కు కవిత లేఖ

కేసీఆర్ హయాంలో మీరే లేఖ రాశాలు.. నేడు హామీ నిలబెట్టుకోండి, సీఎం రేవంత్‌కు కవిత లేఖ
Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద జీవో నం.317 కారణంగా వేలాది మంది ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను ఆమె ఈ లేఖలో ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి తక్షణమే ఉద్యోగులకు న్యాయం చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

నాడు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ…..

Advertisement

2021 డిసెంబర్ 6వ తేదీన అప్పటి ప్రభుత్వం జీవో నం.317ను తీసుకువచ్చినప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. ఈ జీవో వల్ల ఉద్యోగులు తమ సొంత జిల్లాలకు దూరమై మానసిక వేదన అనుభవిస్తున్నారని అప్పట్లో మీరు కేసీఆర్‌కు లేఖ రాశారని సీఎంకు లేఖలో గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా హామీ ఇచ్చారని ఆమె వివరించారు.

సొంత జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్.. 

Advertisement

ప్రస్తుత మంత్రివర్గంలోని పలువురు నాయకులు కూడా గతంలో ఈ జీవో బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారని కవిత తెలిపారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా బాధితులకు ఇంకా న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వన్ టైం రిలీఫ్ కింద ఉద్యోగ ఉపాధ్యాయులను వారి స్థానికత ఆధారంగా స్వస్థలాలకు బదిలీ చేసేలా వెంటనే ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

నిబంధనల్లో మార్పులు అవసరం..: కల్వకుంట్ల కవిత

స్థానికతను గుర్తించే ప్రస్తుత నిబంధనల్లోనూ సమూల మార్పులు చేయాలని కవిత డిమాండ్ చేశారు. వేల కుటుంబాలు ఈ విధానం వల్ల విడిపోయాయని ప్రాధాన్యత క్రమంలో వారందరికీ ఊరట కలిగించాలని విన్నవించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉందని ఆమె స్పష్టం చేశారు.

ALSO READ: అసెంబ్లీలో కుస్తీ పోటీలు వద్దు.. మడతపెట్టి కొట్టేవాళ్లు మా దగ్గరా ఉన్నారు.. రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్

Related News

బర్తరఫ్ తర్వాత తొలిసారి నోరు విప్పిన కొండా సురేఖ..సీయం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

Big Stories

Advertisement
×