E-Paper
Advertisement

Tollywood vs Bollywood: పెరుగుతున్న బాలీవుడ్ సక్సెస్ రేట్.. తెలుగు ఇండస్ట్రీ మేల్కోవాల్సిన సమయం వచ్చిందా..!

Tollywood vs Bollywood: పెరుగుతున్న బాలీవుడ్ సక్సెస్ రేట్.. తెలుగు ఇండస్ట్రీ మేల్కోవాల్సిన సమయం వచ్చిందా..!
Advertisement

Tollywood vs Bollywood: ఈమధ్య కాలంలో బాలీవుడ్ పరిస్థితి స్పష్టంగా మారుతోంది. ఒకప్పుడు బాలీవుడ్ డౌన్, కంటెంట్ లేదు.. అంటూ విమర్శలు ఎదుర్కొన్న హిందీ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు మళ్లీ నెమ్మదిగా బలంగా నిలబడుతోంది. వరుస హిట్లతో సక్సెస్ రేట్ పెరుగుతోంది. ఈ మార్పు చూస్తే తెలుగు ఇండస్ట్రీ కూడా అలర్ట్ కావాల్సిన సమయం వచ్చిందా అనే చర్చ మొదలైంది.

ఇంతకుముందు వరకు బాలీవుడ్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడేవాళ్లు ఎక్కువగా కనిపించేవారు. టాలీవుడ్ సినిమాలే ట్రెండ్ సెట్టర్స్ అని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కంటెంట్, ప్రెజెంటేషన్, కథనం మీద ఫోకస్ పెట్టిన బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పెద్ద హీరోల సినిమా కాకపోయినా, కథ బాగుంటే ఆడియన్స్ ఆదరిస్తున్నారు.

Advertisement

2025 ఏడాది బాలీవుడ్‌కు గోల్డెన్ ఇయర్‌గా మారేలా ఉంది. గత సంవత్సరం నుంచే అక్కడ హిట్‌ల పరంపర మొదలైంది. చావా, ధురందర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ముఖ్యంగా ధురందర్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కథను కన్విన్సింగ్‌గా చెప్పడం, బోర్ లేకుండా నడిపించడం వల్ల సినిమా నిడివి పెద్దగా ఉన్నా ఆడియన్స్ ఫీలింగ్ రాలేదు. భాషా సరిహద్దులు దాటి ఈ సినిమా వసూళ్లు సాధించడం బాలీవుడ్‌కు పెద్ద బూస్ట్ ఇచ్చింది.

ఇప్పుడు అదే రూట్‌లో బార్డర్ 2 దూసుకుపోతోంది. బార్డర్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ రిలీజ్ అయిన తొలి రోజులలోనే 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. వీకెండ్‌కు 250 కోట్ల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లాంగ్ రన్‌లో 500 కోట్ల వరకు చేసే ఛాన్స్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది.

Advertisement

బార్డర్ 2 హడావుడి తగ్గకముందే మార్చిలో ధురందర్ సీక్వెల్ రానుంది. ఈసారి మరింత బలమైన కంటెంట్‌తో వస్తామని దర్శకుడు ఆదిత్యధర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద చూస్తే బాలీవుడ్ మళ్లీ ఫుల్ స్పీడ్‌లోకి వచ్చిందన్నది నిజం. ఈ పరిస్థితిలో టాలీవుడ్ కూడా కొత్త కథలు..బలమైన కథనాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ డౌన్ అవుతున్న సమయంలో టాలీవుడ్ అంతర్జాతీయ పరంగా జండా ఎగరేసింది. బాహుబలి సినిమాతో ఇండియా సినిమా అనగానే.. తెలుగు సినిమా అనే అంతలా ప్రఖ్యాతను తెచ్చుకుంది. అదే సమయంలో బాలీవుడ్ నుంచి అన్ని ఫ్లాపులు రావడంతో టాలీవుడ్ హవా కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ తన హవా మొదలుపెడితే టాలీవుడ్ మాత్రం ఫ్లాప్ సినిమాలు ఎక్కువగా తెచ్చుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా మళ్లీ మంచి విజయాలు సాధించే సినిమాల వైపు.. తెలుగు ఇండస్ట్రీని.. తీసుకుపోవడం చాలా ముఖ్యం.

ALSO READ: Jana Nayagan: విజయ్ జననాయగన్ సినిమాలో స్టార్ డైరెక్టర్ క్యామియో.. ఊహించని ట్విస్ట్ ..

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×