E-Paper
Advertisement

Headache: మాటిమాటికీ తలనొప్పి ఎందుకు వస్తుంది? ఉపశమనం పొందే సహజ మార్గాలు ఇవే..

Headache: మాటిమాటికీ తలనొప్పి ఎందుకు వస్తుంది? ఉపశమనం పొందే సహజ మార్గాలు ఇవే..
Advertisement

Headache: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందిని తరచుగా వేధించే సమస్య తలనొప్పి. ఇది చిన్న చిరాకుగా మొదలై.. ఒక్కోసారి మన దైనిందన జీవితాన్ని పూర్తిగా మార్చేసేలా నొప్పి తీవ్రతను పెంచుతుంది. ఈ తలనొప్పి అనేది ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరినీ పలకరిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో అసలు తలనొప్పి ఎందుకు వస్తుంది? దాన్నెలా ఎదుర్కోవాలి? సహజమైన పద్ధతుల ద్వారా తగ్గించుకునే చిట్కాలేవో ఇప్పుడు చూద్దాం.

అసలు తలనొప్పి ఎందుకొస్తుంది?

మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, శరీరంలో జరుగుతున్న మార్పులే తలనొప్పికి ప్రధాన కారణాలుగా మారుతుంటాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా శరీరానికి తగినంత విశ్రాంతి లేనప్పుడు తల భారం పెరగడం సహజం. అలాగే తగినంత నీరు తాగకపోయినా మన బాడీ డీహైడ్రేషన్ గురవుతుంది. గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్లను చూడటం వల్ల కలిగే కంటి ఒత్తిడి, కూర్చునే పద్ధతి సరిగ్గా లేకపోవడం వల్ల మెడ కండరాలపై పడే భారం తలనొప్పిని ప్రేరేపిస్తాయి. వీటితో పాటు సైనస్ సమస్యలు లేదా మనం తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా ఈ నొప్పులకు కారణం కావచ్చు.

Advertisement

Also Read: రక్తహీనత నుంచి డయాబెటిస్ వరకు.. అన్నింటికీ ముల్బెర్రీ ఒకటే పరిష్కారం!

తలనొప్పి ఎన్ని రకాలు?

తలనొప్పి అనగానే అన్నీ ఒకేలా ఉండవు. కొంతమందికి తల చుట్టూ ఏదో బ్యాండ్ బిగించినట్టుగా అనిపించే టెన్షన్ తలనొప్పి వస్తుంది. మరికొందరికి తలలో ఒక పక్క మాత్రమే విపరీతమైన పోటుగా వచ్చే మైగ్రేన్ సమస్య వేధిస్తుంది. ఇంకొందరికి కంటి వెనుక భాగంలో తీవ్రమైన నొప్పిని కలిగించే క్లస్టర్ తలనొప్పులు రావచ్చు. ఇవన్నీ వేర్వేరు కారణాల వల్ల కలిగినా.. మనకు కలిగించే అసౌకర్యం మాత్రం వర్ణనాతీతం.

తక్షణ ఉపశమనం పొందడమెలా?

Advertisement

తలనొప్పిని కొన్ని సహజమైన పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చు. నొప్పిగా అనిపించినప్పుడు సైలెంట్‌గా, లైలింగ్ తక్కువగా ఉన్న రూంలో కాసేపు రెస్ట్ తీసుకోవాలి. దీంతో మెదడుకు కాస్త రిలీఫ్ లభిస్తుంది. నుదిటిపై లేదా మెడ వెనుక భాగంలో చల్లని వస్త్రాన్ని ఉంచడం ద్వారా రక్త ప్రసరణలో మార్పులు జరిగి నొప్పి తగ్గుతుంది. అలాగే, దీర్ఘ శ్వాస తీసుకోవడం లేదా కాసేపు ధ్యానం చేయడం వల్ల కూడా తలనొప్పి తగ్గవచ్చు. దీంతోపాటు శరీరానికి తగినంత నీరు అందిస్తూ.. హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం.

 నొప్పికి కారణం తెలుసుకోవడమెలా?

తరచుగా తలనొప్పి వేధిస్తుంటే.. దానికి గల అసలు కారణం ఏంటో తెలుసుకోండి. దీని కోసం చిన్న డైరీలో మీకు నొప్పి ఎప్పుడు మొదలైంది? ఆ సమయంలో మీరు ఏం తిన్నారు? మీరెన్ని గంటలు నిద్రపోతున్నారు? వంటి విషయాలను రాసుకోండి. ఇలా చేయడం వల్ల మీ తలనొప్పికి కారణమయ్యే అలవాట్లను మీరు సులభంగా మార్చుకోవచ్చు.

తీవ్రత ఎక్కవైతే?

చాలావరకు తలనొప్పులు కాసేపు విశ్రాంతి లేదా చిన్న చిన్న నివారణలతో తగ్గిపోతాయి. కానీ, నొప్పి మరీ తీవ్రంగా ఉన్నా లేదా తరచుగా వస్తూ మీ రోజువారీ జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నా తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. నొప్పి కారణాన్ని బట్టి సరైన చికిత్స తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యల నుండి రక్షణ పొందవచ్చు.

Also Read: చేతులు గరుకుగా మారాయా? ఓట్‌మీల్, చక్కెరతో ఇలా మృదువుగా మార్చుకోండి!

Related News

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

Big Stories

Advertisement
×