E-Paper
Advertisement

Jana Nayagan: విజయ్ జననాయగన్ సినిమాలో స్టార్ డైరెక్టర్ క్యామియో.. ఊహించని ట్విస్ట్ ..

Jana Nayagan: విజయ్ జననాయగన్ సినిమాలో స్టార్ డైరెక్టర్ క్యామియో.. ఊహించని ట్విస్ట్ ..
Advertisement

Jana Nayagan: తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దళపతి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా నటుడిగా గుర్తింపు పొందిన ఈయన రాజకీయాలపై దృష్టి సారించి ప్రస్తుతం రాజకీయాల పరంగా బిజీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇకపై తాను సినిమాలలో నటించనని తన ఆఖరి చిత్రం జననాయగన్ (Jana Nayagan)అంటూ ఇటీవల అధికారకంగా వెల్లడించడంతో అభిమానులు కూడా కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఇక విజయ్ నటించిన జననాయగన్ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9వ తేదీ విడుదల చేయాలని భావించారు అయితే ఈ సినిమాకు సెన్సార్ సమస్యలు ఎదురవడంతో ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వ్యవహారం కోర్టులో ఉండడంతో సినిమా విడుదల మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.

జననాయగన్ విడుదల?

ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ సర్టఫికెట్ కి సంబంధించిన పిటీషన్ మద్రాస్ హైకోర్టులో ఉంది. త్వరలోనే ఈ విషయంపై కోర్టు చిత్ర బృందానికి అనుగుణంగా తీర్పు వెల్లడించబోతుందని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా హెచ్ వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కగా కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించగా విజయ్ కూతురి పాత్రలో మమిత బైజు నటించబోతున్నారు.

క్యామియో పాత్రలో లోకేష్ కనగరాజ్..

Advertisement

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఒక స్టార్ డైరెక్టర్ క్యామియో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ తెలియచేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ సినిమాలో క్యామియో పాత్రలో కనిపించబోతున్న డైరెక్టర్ ఎవరనే విషయానికి వస్తే.. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో లోకేష్ కనగారాజ్ (Lokesh Kanagaraj)ఒకరు.

హీరోగా లోకేష్ కనగరాజ్..

Advertisement

ప్రస్తుతం ఈయన దర్శకుడిగా కొనసాగుతూనే మరోవైపు హీరోగా కూడా వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ లోకేష్ జన నాయగన్ సినిమాలో క్యామియో పాత్రలో నటించబోతున్నారనే విషయాన్ని స్వయంగా వెల్లడించారు. హెచ్ వినోద్ తనను ఒక చిన్న పాత్ర కోసం అడగడంతో ఒకరోజు షూటింగ్లో పాల్గొన్నానని ఈ సందర్భంగా లోకేష్ తన క్యామియో గురించి తెలియజేయడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Pawan Kalyan: సర్దార్ పవన్ కళ్యాణ్.. కొత్త అవతారంలో సర్‌ప్రైజ్ ఇచ్చిన పవర్ స్టార్, ఫొటోలు వైరల్

Related News

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

హైదరాబాద్‌లో ‘ఒడిస్సీ’ మూవీని ఎంజాయ్ చేయడానికి పెర్ఫెక్ట్ థియేటర్లు ఇవే, స్క్రీన్.. సౌండ్ అదుర్స్!

సెన్సార్ పూర్తి చేసుకున్న నయనతార ‘హాయ్’.. రిలీజ్ డేట్ లాక్!

Big Stories

Advertisement
×