Boyapati Sreenu: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో బోయపాటి శ్రీను(Boyapati Sreenu) ఒకరు. భద్ర సినిమాతో దర్శకుడుగా పరిచయమైన ఈయన అనంతరం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. బోయపాటి డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2(Akhanda 2 ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు బాలకృష్ణ సినిమాలు కేవలం తెలుగుకు మాత్రమే పరిమితమయ్యాయి. మొదటిసారి అఖండ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో బాలకృష్ణ , ఇతర చిత్ర బృందం ముంబైలో పెద్ద ఎత్తున ప్రమోషన్లలో పాల్గొని సందడి చేశారు. ఇక ముంబైలో నిర్వహించిన ఒక ఇంటర్వ్యూతో పాటు సాంగ్ లంచ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ హిందీలో మాట్లాడిన సంగతి తెలిసిందే. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ముంబైలో నిర్వహించిన ఇంటర్వ్యూలో హిందీలో మాట్లాడిన సంగతి తెలిసిందే.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బోయపాటి శ్రీను హిందీలో మాట్లాడిన నేపథ్యంలో భారీగా విమర్శలు వచ్చాయి. “హమ్ నహి బోలో దియా కాషన్ కియా” అనే స్టేట్మెంట్ పై భారీగా విమర్శలు వచ్చాయి. ఇక ఈ విమర్శల గురించి తాజాగా బోయపాటి శ్రీను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నేను ఇక్కడ హిందీలో ఏదైతే నేర్చుకున్నానో అదే అక్కడ మాట్లాడాను నేనేమీ బూతులు మాట్లాడలేదు కదా అంటూ బోయపాటి తెలిపారు.
డిజె సాంగ్ క్రియేట్ చేస్తారేమో..
నేను మాట్లాడిన ఈ కామెంట్స్ బాగా వైరల్ అవ్వడమే కాకుండా అదొక టైప్ ప్రమోషన్ లో భాగంగా మా సినిమాకు కలిసి వచ్చిందంటూ బోయపాటి శ్రీను ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూలోనే తమన్ కూడా పాల్గొన్నారు. తమన్ కూడా ఈ ట్రోల్స్ పై స్పందిస్తూ.. న్యూ ఇయర్ సందర్భంగా డిజె సాంగ్ క్రియేట్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెబుతారేమో అంటూ సరదాగా ఈ ట్రోల్స్ పై స్పందిస్తూ నవ్వుకున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా ఇప్పటివరకు కేవలం తెలుగులో మాత్రమే విడుదలయ్యాయి అందుకే ఈయనకు పెద్దగా హిందీపై పట్టు లేదని స్పష్టమవుతుంది. మొదటిసారి బోయపాటి సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన నేపథ్యంలోనే వచ్చిరాని హిందీలో మాట్లాడుతూ ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నారని తెలుస్తోంది.
Also Read: Balakrishna: వారణాసిలో హిందీలో స్పీచ్ ఇచ్చిన బాలయ్య… అఖండ 2 తెలుగు సినిమా కాదంటూ!