E-Paper
Advertisement

Realme 16 Pro Series: భారత్‌లోకి రియల్‌మీ 16 ప్రో సిరీస్ ఎంట్రీకి రెడీ.. ఏమేం ఫీచర్లు ఉన్నాయో తెలుసుకోండి మరి!

Realme 16 Pro Series: భారత్‌లోకి రియల్‌మీ 16 ప్రో సిరీస్ ఎంట్రీకి రెడీ.. ఏమేం ఫీచర్లు ఉన్నాయో తెలుసుకోండి మరి!
Advertisement

Realme 16 Pro Series: కొత్త ఏడాదిలో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నవారికి శుభవార్త. ‘రియల్‌మీ 16 ప్రో’ వచ్చేనెల ప్రారంభంలో భారత్‌లో లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో రియల్‌మీ 16 ప్రో 5G, రియల్‌మీ 16 ప్రో+ 5G అనే రెండు మోడళ్లను కంపెనీ తీసుకు రానుంది. లాంచ్ తేదీని రియల్‌మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. జపనీస్ డిజైనర్ నవోటో ఫుకాసావాతో కలిసి రూపొందించిన ఈ ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ఉండనుందని కంపెనీ తెలిపింది.

విడుదల తేదీ ఇదే:

రియల్‌మీ 16 ప్రో సిరీస్ లాంచ్ డేట్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌ను జనవరి 6, 2026న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో విడుదల చేయనుంది. ఇందులో Realme 16 Pro 5G, రియల్‌మీ 16 ప్రో+ 5G అనే రెండు మోడళ్లు ఉంటాయి. లాంచ్ అయిన వెంటనే ఇవి ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ ఇండియా ఆన్‌లైన్ స్టోర్లో కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

Also Read: బడ్జెట్‌లో బిగ్ స్క్రీన్ 5G స్మార్ట్‌ఫోన్.. అమెజాన్‌లో రెడ్‌మీ 15C 5Gపై సూపర్ సేల్ ఆఫర్!

200 మెగాపిక్సెల్ కెమెరా:

ఇక కెమెరా విభాగంలో రియల్‌మీ 16 ప్రో 5G, రియల్‌మీ 16 ప్రో+ 5G ఫోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రెండు మోడళ్లలోనూ 200MP లూమా కలర్ ఇమేజ్-పవర్డ్ పోర్ట్రెయిట్ మాస్టర్ ప్రైమరీ కెమెరా ఉండనున్నట్లు కంపెనీ ధృవీకరించింది.

డిజైన్ విషయానికి వస్తే..

Advertisement

జపనీస్ డిజైనర్ నవోటో ఫుకాసావాతో కలిసి రూపొందించిన కొత్త ‘అర్బన్ వైల్డ్’ డిజైన్ ఇందులో కనిపించనుంది. ఈ సిరీస్ ఫోన్లు మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే రంగులతో పాటు, భారత్‌కు ప్రత్యేకమైన కామెల్లియా పింక్, ఆర్చిడ్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే వెనుక భాగంలో స్క్వేర్ షేప్‌లో ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్, LED ఫ్లాష్‌తో కనిపించనుంది. పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ కుడి వైపున ఫ్రేమ్‌పై ఉంటాయి.

 అడ్వాన్స్‌డ్ ఎడిటింగ్ ఫీచర్లు:

పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. Realme 16 Pro+ 5G శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 కంటే మెరుగైన పనితీరును అందిస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే, ఫోన్‌లో 10x జూమ్‌కు మద్దతిచ్చే పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా ఉంటుంది. రెండు మోడళ్లు AI Edit Genie 2.0కు మద్దతిస్తాయి. ఇందులో AI StyleMe, AI LightMe వంటి అడ్వాన్స్‌డ్ ఎడిటింగ్ ఫీచర్లు ఉన్నాయి.

Also Read: విడుదలకి ముందే వివో X200T స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, కీలక వివరాలు లీక్!

Related News

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×