E-Paper
Advertisement

Akhanda 2 : అఖండ రేపైనా రిలీజ్ అవుతుందా? వాయిదా తప్పదా?

Akhanda 2 : అఖండ రేపైనా రిలీజ్ అవుతుందా? వాయిదా తప్పదా?
Advertisement

Akhanda 2 : ఒక సినిమా విడుదలవుతుంది అంటే విపరీతమైన ప్లానింగ్ ఉండాలి. రిలీజ్ విషయంలో ఎటువంటి అడ్డంకులు రాకుండా ముందుగానే అన్ని సిద్ధం చేసుకోవాలి. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న అఖండ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంది. ఈ తరుణంలో సినిమాకి ఊహించిన విధంగా అనేక ఇబ్బందులు వచ్చి పడ్డాయి.

ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. మరి కాసేపట్లో ఇండియాలో ప్రీమియర్ షోస్ మొదలై పోతాయి అనుకునే తరుణంలో కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వలన ఈ సినిమా ప్రీమియర్స్ పడలేదు. రేపు ఈ సినిమా విడుదల కానున్నట్లు గత కొన్ని రోజులుగా అధికారికంగా ప్రకటిస్తూనే ప్రమోషన్స్ కూడా విపరీతంగా చేశారు. సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు.

రేపైనా రిలీజ్ అవుతుందా? 

Advertisement

ఈ సినిమాకి ఉన్న పంచాయతీలు మామూలువి కాదు. అయితే ఈ పంచాయతీలు ఇప్పుడు క్లియర్ కాకపోవడం వల్లనే ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయిపోయాయి. ఇక రేపు అధికారికంగా సినిమా రిలీజ్ కావలసి ఉంది కాబట్టి సినిమా రేపు కూడా రిలీజ్ అవ్వడం డౌట్ అని తెలుస్తుంది.

ఎందుకంటే ఇప్పటికిప్పుడు క్లియర్ అవ్వని పంచాయితీ కేవలం ఒక్క రోజులో క్లియర్ అయిపోతుందా అంటే అది కూడా డౌట్. ఒకవేళ ఈ సినిమా రేపు కూడా రిలీజ్ అవ్వకపోతే చాలామంది బాలకృష్ణ అభిమానులు తీవ్రమైన నిరాశకు గురవుతారు. ఎందుకంటే భారీ అంచనాలతో విడుదలవుతున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది.

వాయిదా తప్పదా? 

Advertisement

అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడబోతుంది అని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. అయితే ఒకవేళ ఈ డేట్ మిస్ అయింది అంటే కచ్చితంగా అది సినిమాకి తీవ్రమైన నష్టాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ముందు నుంచే ఈ డేట్ ను అనౌన్స్ చేయడం వల్ల చాలా సినిమాలు వెనక్కి తగ్గి డిసెంబర్ 12న ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.

ఇప్పుడు ఈ సినిమాని వాయిదా వేస్తే మరికొన్ని సినిమాలు రిలీజ్ డేట్ లో మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ తరుణంలో నిర్మాతలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. సినిమా మీద మాత్రం విపరీతమైన కాన్ఫిడెన్స్ చాలామందికి ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుంది అని చాలామంది నమ్ముతున్నారు. ఈ తరుణంలో సినిమా మాత్రం బెడిసి కొడితే ఇది మామూలు రిస్క్ కాదు అని చెప్పాలి.

Also Read: SPIRIT : సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాకి బ్రేక్, జపాన్ వెళ్తున్న ప్రభాస్

Related News

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

Big Stories

Advertisement
×