E-Paper
Advertisement

Brahmanandam: వాళ్ళు నన్నేం చేయరు.. సెక్యూరిటీ పై బ్రహ్మానందం సీరియస్  .. ఏమైందంటే?

Brahmanandam: వాళ్ళు నన్నేం చేయరు.. సెక్యూరిటీ పై బ్రహ్మానందం సీరియస్  .. ఏమైందంటే?
Advertisement

Brahmanandam: టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ బ్రహ్మానందం గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన కొన్ని వందలకు పైగా సినిమాలలో కమెడియన్గా నటిస్తూ తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. అప్పట్లో ఏదైనా సినిమా వస్తుందంటే చాలు కచ్చితంగా ఆ సినిమాలో బ్రహ్మానందం ఉండి తీరాల్సిందే. ఇలా బ్రహ్మానందం కామెడీతో కూడా సినిమాలు హిట్ అయ్యాయి అంటే ఈయన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనిలేదు. తులసిని ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతూ ఎన్నో పురస్కారాలను అవార్డులను ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న బ్రహ్మానందం ఇటీవల సినిమాలను పూర్తిగా తగ్గిస్తూ వచ్చారు. వయసు పైబడటంతో బ్రహ్మానందం పెద్దగా సినిమాలలో కూడా నటించడం లేదు.

సెల్ఫీల కోసం ఎగబడిన అభిమానులు..

ఇదిలా ఉండగా బ్రహ్మానందం తాజాగా నటుడు అర్జున్ సర్జ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సీత పయనం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు.. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం హాజరు కావడంతో ఒకసారిగా అభిమానులు తనతో సెల్ఫీ దిగడం కోసం ఎగబడ్డారు. ఇలా అభిమానులు తోసుకుంటూ రావడంతో బ్రహ్మానందం సెక్యూరిటీ అభిమానులను అడ్డుకునే ప్రయత్నం చేశారు .దీంతో ఒక్కసారిగా బ్రహ్మానందం తన సెక్యూరిటీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు నన్నేం చేయలేరు నువ్వు వెళ్లి అక్కడ నిల్చో అంటూ ఈయన సెక్యూరిటీ పై మండిపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అర్జున్ సర్జా సీతా పయనం..

Advertisement

ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ప్రేక్షకులను ఎంతగానో ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు ఆదరణతోనే తాము ఈ స్థాయికి వచ్చామని చెబుతూ ఉంటారు అలాంటిది తమ అభిమానులను ఇబ్బంది పెడితే సెక్యూరిటీని మందలిస్తూ ఉంటారు అలాంటి జాబితాలో బ్రహ్మానందం కూడా ఒకరు. ఇలా అభిమానులను చేయొద్దు అంటూ సెక్యూరిటీకి ఈయన వార్నింగ్ ఇవ్వడంతో అభిమానులు బ్రహ్మానందం తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సీతా పయనం సినిమా విషయానికి వస్తే అర్జున్ సర్జా దర్శకత్వంలో ఈయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగానే ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

Also Read: Anil Ravipudi: యాక్షన్.. కట్ మీరే చెప్పేయండి.. ఫైనల్లీ తన సినిమాపై అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×