E-Paper
Advertisement

Medaram Jathara 2026: మేడారం సమ్మక్క–సారక్క కానుకల లెక్కింపు.. 828 హూండీల ద్వారా వచ్చిన ఆదాయం ఎంతంటే?

Medaram Jathara 2026: మేడారం సమ్మక్క–సారక్క కానుకల లెక్కింపు.. 828 హూండీల ద్వారా వచ్చిన ఆదాయం ఎంతంటే?
Advertisement

Medaram Jathara 2026: మేడారం సమ్మక్క–సారక్క జాతర–2026 సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హూండీల లెక్కింపు ప్రక్రియ హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో పారదర్శకంగా కొనసాగుతోంది. దేవాదాయ శాఖ అధికారులు, సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో గత ఆరు రోజులుగా జరుగుతున్న ఈ లెక్కింపులో ఇప్పటివరకు మొత్తం రూ.12.64 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. జాతర కోసం ఏర్పాటు చేసిన మొత్తం 828 హూండీలను ఇప్పటికే తెరిచి లెక్కించినట్లు సమాచారం.

లెక్కింపు వివరాలను పరిశీలిస్తే, ఫిబ్రవరి 5 నుంచి 10వ తేదీ వరకు వివిధ దశల్లో ఆదాయం నమోదైంది. అత్యధికంగా ఫిబ్రవరి 6వ తేదీన రూ.3.54 కోట్లు రాగా, చివరి రోజైన ఫిబ్రవరి 10న 40 హూండీల ద్వారా రూ.80.81 లక్షల ఆదాయం వచ్చింది. ఫిబ్రవరి 10న లెక్కించిన ఈ నగదును పర్యవేక్షణాధికారుల సమక్షంలో నేరుగా బ్యాంకు అధికారులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. 828 హూండీలలో 780 ఇనుప హూండీలు, 45 వస్త్ర హూండీలు, 3 బియ్యం హూండీలు ఉన్నాయని వారు వివరించారు.

Advertisement

నగదుతో పాటు భక్తులు సమర్పించిన బంగారం, వెండి కానుకలను ప్రస్తుతం ఇనుప హూండీలలో భద్రపరిచారు. వీటి విలువను నిర్ధారించే అప్రైజ్‌మెంట్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, నాణేల లెక్కింపు, ఈ-హుండీ (E-Hundi) లెక్కింపు ప్రక్రియలు ప్రారంభం కావాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. విదేశీ కరెన్సీ రూపంలో కూడా కొంత ఆదాయం సమకూరినట్లు లెక్కింపు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ లెక్కింపు ప్రక్రియ అంతా నిబంధనల మేరకు ప్రశాంతంగా పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ భరోసా ఇచ్చింది.

Read Also: HYDRA: రూ. 1511 కోట్ల భూములు సేఫ్.. ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో హైడ్రా బిగ్ ఆపరేషన్లు!

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×