E-Paper
Advertisement

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?
Advertisement

Ritu Varma: సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వినిపించే రూమర్స్ ఒక్కొక్కసారి నిజం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా పంజా వైష్ణవ్ , ప్రముఖ బ్యూటీ రీతూ వర్మ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఇద్దరు స్పందించినప్పటికీ రూమర్స్ మాత్రం ఎక్కడా ఆగలేదు. అయితే గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్న నేపథ్యంలో సడన్గా ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ మరొక వార్త తెరపైకి వచ్చింది. మరి నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా? ఒకవేళ ఉంటే ఇద్దరి మధ్య నిజంగానే బ్రేకప్ జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ అనుమానాలకు చెక్ పెడుతూ మరో వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పరిచయమే లేని చోట ప్రేమ ఎలా?

మెగా మేనల్లుడిగా ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించారు పంజా వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత కొండపొలం , రంగ రంగ వైభవంగా, ఆదికేశవ వంటి సినిమాలు చేశాడు. ఇక 2023 నుంచి ఇప్పటివరకు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించబోయే సరికి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో సడన్ గా వైష్ణవ్ తేజ్ .. పెళ్లిచూపులు హీరోయిన్ రీతూ వర్మతో ప్రేమలో ఉన్నట్లు ఫిలిం వర్గాలలో ఒక టాక్ జోరుగా నడుస్తోంది. నిజానికి వీరిద్దరూ ఎలాంటి సినిమాలో నటించలేదు. కానీ వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అసలే కలిసి నటించని వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఎప్పుడు? ఎక్కడ మొదలైంది? అనేది ఆసక్తికరంగా మారింది.

ప్రేమ పుట్టనిచోట బ్రేకప్ ఉంటుందా?

Advertisement

మొదట వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ వచ్చిన వార్తలను చాలామంది కొట్టి పారేశారు. కానీ సడన్గా లావణ్య – వరుణ్ తేజ్ పెళ్లిలో రీతూ వర్మ సందడి చేయడం.. మెగా కుటుంబంలో జరిగే కొన్ని కార్యక్రమాలకు హాజరు కావడంతో నిజంగానే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఒక ఇంటర్వ్యూలో ఈ ఊహాగానాలపై వైష్ణవ్ తేజ్ స్పందించారు. రీతు వర్మ నాకు లావణ్య ద్వారా పరిచయం. ఆమె నాకు కూడా మంచి స్నేహితురాలు. అంతకుమించి మా మధ్య ఏం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో మరెక్కడా వీరిద్దరి ప్రస్తావన రాలేదు. కానీ సడన్ గా మళ్లీ వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

also read:మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

రూమర్స్ కి చెక్.. సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్న వైష్ణవ్ – రీతూ..

Advertisement

కానీ అలాంటిదేమీ లేదు అని, రీతూ వర్మతో వైష్ణవ్ తేజ్ రిలేషన్ కొనసాగిస్తున్నారు అంటూ తాజాగా మరో వార్త నెట్టిండా వైరల్ అవుతోంది. అయితే వీరిద్దరూ తమ బంధాన్ని మీడియాకి దూరంగా, రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారట. దీనికి తోడు రీతు వర్మ కూడా ఇటీవల తన అధికారిక సోషల్ మీడియాలో కొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించినట్లు ఒక పోస్ట్ పెట్టగా.. దానికి వైష్ణవ్ లైక్ కొట్టడంతో అది కాస్త చర్చనీయాంశంగా మారింది. ఫలితంగా రీతు వర్మ, వైష్ణవ్ తేజ్ ల రిలేషన్ న్యూస్ మరోసారి వెలుగులోకి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, తమ బంధాన్ని రహస్యంగా కొనసాగిస్తున్నారని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ దీనిపై వీరిద్దరూ అధికారికంగా స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.

వైష్ణవ్ తేజ్ – రీతు వర్మ సినిమాలు..

ఇక వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే.. వైష్ణవ్ తేజ్ గత కొంతకాలంగా మరో సినిమా ప్రకటించలేదు. ప్రస్తుతం ఒక బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని కథా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరొకవైపు రీతూ వర్మ గోపీచంద్ తో కలిసి భరతవర్ష అనే సినిమాలో సత్యవతి అనే పాత్ర పోషిస్తుంది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఏడవ శతాబ్దపు చారిత్రక నేపథ్యంతో రాబోతున్న ఈ సినిమాలో ఒక గిరిజన యువతిగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదల కోసం ఆమె ఎదురు చూస్తున్నట్లు సమాచారం.

Related News

స్మోకింగ్ చేస్తోన్న నయనతార.. మార్పుకు కారణం?

కూతురు టాలీవుడ్ ఎంట్రీపై రవీనా టాండన్ ఏమన్నారంటే?

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

Big Stories

Advertisement
×