E-Paper
Advertisement

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!
Advertisement

Murali Kishor:ప్రముఖ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు ఒక్క సినిమాతో భారీ లైమ్ లైట్ లోకి వచ్చేసారు. నిజానికి ఈయన కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా చేశారు. నంబర్ నైబరింగ్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే మెప్పించింది. ఇప్పుడు అఖిల్ తో చేసిన లెనిన్ సినిమా ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే మురళి పేరు వినిపిస్తూ ఉండడం గమనార్హం. అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా, సునీల్ కీలక పాత్రలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా అఖిల్ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. పైగా ఈ సినిమా రూ.100 కోట్ల దిశగా అడుగులు వేస్తూ ఉండడంతో పాటు అఖిల్ కి ,ఇటు మురళి కిషోర్ అబ్బూరుకి కూడా ఈ సినిమా బాగా కలిసి వచ్చింది.

లెనిన్ డైరెక్టర్ కొత్త ప్రాజెక్టు..

జూలై 20వ తేదీన హైదరాబాద్ వేదికగా “లెనిన్ బ్లాక్ బస్టర్” ఈవెంట్ ను కూడా నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా మరొకవైపు మురళీ కిషోర్ అబ్బూరు అప్పుడే మరో కథను సిద్ధం చేశారని.. ఆ హీరోతో కథా చర్చలు కూడా జరుపుతున్నారని, త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మళ్లీ అదే బ్యాక్ డ్రాప్ లో కొత్త ప్రాజెక్ట్..

Advertisement

ఇకపోతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. మురళీ కిషోర్ అబ్బూరు ఈసారి టాలీవుడ్ లో కాకుండా కోలీవుడ్ లో ఒక స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నారు. ఈసారి కూడా ఆయనకు మంచి విజయాన్ని అందించిన రూరల్ బ్యాక్ డ్రాప్ కథతోనే రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మురళీ కిషోర్ మాత్రం ఏకంగా కోలీవుడ్ హీరోకి తన సినిమా కథను ఇప్పటికే వినిపించారని, ప్రస్తుతం కథ చర్చల్లో ఉందని , ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం టాలీవుడ్ లో సత్తా చాటిన మురళీ కిషోర్ అబ్బూరు కోలీవుడ్ లో కూడా తన పాదం పెట్టబోతున్నారని, అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకోవాలని అక్కినేని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు.

also read:NBK 111:బాబాయ్ కోసం అబ్బాయ్ ఎమోషనల్ మెసేజ్.. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడంటే?

మురళీ కిషోర్ సినిమాలు..

Advertisement

కిరణ్ అబ్బవరం, కాశ్మీరా పరదేశి ప్రధాన పాత్రలో నటించిన వినరో భాగ్యము విష్ణు కథ 2023లో నంబర్ నైబరింగ్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు రూరల్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన లెనిన్ సినిమా ఏకంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఈ సినిమా టాలీవుడ్ దర్శకులలో ఒకరిగా ఈయన స్థానాన్ని పదిలం చేసిందని చెప్పవచ్చు. తదుపరి పట్టాలెక్కే ప్రాజెక్టుతో మురళీ కిషోర్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

స్మోకింగ్ చేస్తోన్న నయనతార.. మార్పుకు కారణం?

కూతురు టాలీవుడ్ ఎంట్రీపై రవీనా టాండన్ ఏమన్నారంటే?

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

Big Stories

Advertisement
×