Aishwarya Rai:పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్పుడప్పుడు కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు అయితే సామాన్యుల గురించి కాస్త పక్కన పెడితే.. సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన ఏ విషయమైనా సరే ఇట్టే సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.ఇక స్టార్ హీరో హీరోయిన్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే మాజీ విశ్వసుందరిగా స్టార్ హీరోయిన్గా భార్య పాపులారిటీ సొంతం చేసుకున్న ఐశ్వర్యరాయ్ తన కూతురి విషయంలో తీసుకున్న కఠిన నిర్ణయం గురించి ఆమె భర్త అలాగే ప్రముఖ హీరోగా పేరు దక్కించుకున్న అభిషేక్ బచ్చన్ రివీల్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
విషయంలోకి వెళ్తే ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు కూడా సెల్ఫోన్ లేనిదే భోజనం చేయడం లేదు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. వారి లగ్జరీని బట్టి లగ్జరీ గ్యాడ్జెట్స్ తో కాలం గడిపేస్తున్నారు. ఇక ఈమధ్య స్కూల్ యాజమాన్యం కూడా పిల్లలకు మొబైల్ ఫోన్ నిత్యావసరంగా మార్చేసింది. అయితే ఇలాంటి సమయంలో మొబైల్ ఫోన్ వాడకంపై ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ల నిర్ణయం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. “మా కూతురు ఆరాధ్యకి ప్రస్తుతం 14 సంవత్సరాలు. అయితే ఇప్పటికీ కూడా ఆమెకు సొంతంగా మొబైల్ ఫోన్ లేదు. నేటి కాలంలో చిన్న పిల్లలకే స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి.
ALSO READ:SreeLeela: సక్సెస్ కోసం ఆరాటం.. డీసీఎం గారైనా కాపాడుతారా?
ఒకవేళ ఆరాధ్య స్నేహితులు ఎవరైనా సరే ఆమెతో మాట్లాడాలనుకుంటే వారు నేరుగా ఐశ్వర్యరాయ్ ఫోన్ కి కాల్ చేయాల్సి ఉంటుంది. ఆరాధ్యకి మొబైల్ ఇవ్వకపోవడానికి ఒక కారణం ఉంది. పిల్లలను డిజిటల్ యుగానికి దూరంగా.. క్రమశిక్షణతో పెంచాలనే ఉద్దేశంతోనే ఐశ్వర్య ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది. సెలబ్రిటీ హోదాలో ఉండి కూడా ఒక సాధారణ పిల్లల తరహాలోనే ఆరాధ్యను పెంచుతోంది అంటూ అభిషేక్ బచ్చన్ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఐశ్వర్యరాయ్ నిర్ణయం చూసి సామాన్య ప్రజలు కూడా దీనిని అలవాటుగా మార్చుకోవాలని, పిల్లలకు మొబైల్ ఫోన్ అలవాటు చేయకూడదు అని కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఐశ్వర్యరాయ్ విషయానికి వస్తే.. మాజీ విశ్వసుందరిగా పేరు దక్కించుకున్న ఈమె అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది. ముఖ్యంగా తమిళ్, హిందీ చిత్రాలలో సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ను తమిళ్లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ తో ప్రారంభించింది. ఆ తర్వాత ఈ సినిమా సీక్వెల్లో కూడా నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.