E-Paper
Advertisement

Bunny Vas on Sri Tej : అప్పుడు సాయం అన్నారు… ఇప్పుడు సాకులు చెబుతున్నారు

Bunny Vas on Sri Tej : అప్పుడు సాయం అన్నారు… ఇప్పుడు సాకులు చెబుతున్నారు
Advertisement

Bunny vas On sri Tej:  పుష్ప 2 సినిమా అంటే అందరికీ ఈ సినిమా సాధించిన రికార్డులతో పాటు ఈ సినిమా కారణంగా అల్లు అర్జున్ ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా గుర్తుకు వస్తాయి. ఈ సినిమా విడుదలై సరిగా నేటికీ ఏడాది పూర్తి అయింది. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే అభిమాని మరణించారు. ఈ ఘటనలో భాగంగా రేవతి కుమారుడు శ్రీ తేజ్(Sree Tej) కూడా గాయాలు పాలై ఇప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్నారు. ఇక ఈ విషయంలో భాగంగా అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాట ఘటనలో భాగంగా  శ్రీ తేజ్ కు అవసరమైన చికిత్సను అందిస్తాము అంటూ గతంలో అల్లు అర్జున్ భరోసా ఇచ్చారు.

శ్రీ తేజ్ కు అందని సాయం…

ఇక శ్రీతేజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన సమయంలో ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు నిర్మాతలు దర్శకులు వెళ్లి తనని పరామర్శించి వచ్చారు అవసరమైన సహాయం చేస్తామని మాట ఇచ్చారు.  ఈ ఘటన జరిగి సరిగ్గా నేటికీ ఏడాది అవుతున్న నేపథ్యంలో శ్రీ తేజ్ కు సాయం అందడం లేదంటూ ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతుంది. ఈ ఘటన పట్ల స్వయంగా శ్రీ తేజ్ తండ్రి మాట్లాడుతూ ప్రతినెల సుమారు రూ. 1.5 లక్షలు మందులకే ఖర్చవుతుందని, అయితే అల్లు కుటుంబం మాత్రం తన కొడుకు విషయంలో ఏమాత్రం స్పందించలేదని తెలిపారు. ఇలా శ్రీ తేజ్ కు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో నిర్మాత బన్నీ వాసుకి కూడా ఇదే ప్రశ్న ఎదురయింది.

శ్రీ తేజ్ ఆరోగ్యం పై బన్నీ వాసు కామెంట్స్..

Advertisement

బన్నీ వాసు సమర్పణలో ఈషా అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా శ్రీ తేజ్ గురించి బన్నీ వాసుకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు బన్నీ వాసు సమాధానం చెబుతూ.. శ్రీ తేజ్ విషయంలో మేమేం ఏం నిర్ణయాలు తీసుకోవాలన్న మధ్యలో దిల్ రాజు లాంటి పెద్ద మనుషులు ఉన్నారని, అటు నుంచి ఏం వచ్చినా, ఇటునుంచి మేమేం చేయాలనుకున్న పెద్ద మనుషులను సంప్రదించి ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

సాకులు చెప్పిన నిర్మాత?

Advertisement

ఇక ఈ విషయంలో మేము కొన్ని గైడ్లైన్స్ ఫాలో అవుతున్నావని తెలిపారు. వీళ్ల ఇచ్చిన ఫండ్ ఎక్కడ ఉండాలి. అందులో నుంచి హాస్పిటల్ ఖర్చుకి ఎంత వెళ్లాలి, వారి నెలసరి ఖర్చులకు ఎంత ఇవ్వాలి అనేవి గైడ్లైన్స్ ప్రకారమే ఫాలో అవుతున్నామని తెలిపారు. ఇక ఆ డబ్బు వారికి సరిపోలేదు అనుకుంటే మధ్యలో పెద్ద మనుషులతో మాట్లాడాల్సి ఉంటుందని వారి ద్వారా మేము ఏదైనా చేయాలనుకుంటే చేస్తామని తెలిపారు. అయినా ఈ విషయం గురించి మాట్లాడటానికి ఇది సరైన వేదిక కాదు అంటూ శ్రీ తేజ్ ఘటనను ఎక్కువగా మాట్లాడటానికి బన్నీ వాసు ఇష్టపడలేదు. ఇలా బన్నీ వాసు చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. అప్పుడు సాయం అని చెప్పి ఇప్పుడు సాకులు చెబుతున్నారా? అంటూ ఈ వ్యాఖ్యలపై విమర్శలు కురిపిస్తున్నారు.

Also Read: Bunny Vasu: దయచేసి అలాంటి వాళ్ళు మా సినిమాకు రావద్దు.. మొహం మీదే చెప్పిన నిర్మాత!

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×