E-Paper
Advertisement

Irfan Pathan: జ‌డేజా చేత‌కానీ త‌నం వ‌ల్లే టీమిండియా ఓట‌మి.. ఇక రిటైర్మెంట్ తీసుకో !

Irfan Pathan: జ‌డేజా చేత‌కానీ త‌నం వ‌ల్లే టీమిండియా ఓట‌మి.. ఇక రిటైర్మెంట్ తీసుకో !
Advertisement

Irfan Pathan: సౌత్ ఆఫ్రికాతో రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా.. రాయిపూర్ వేదికగా జరిగిన రెండవ వన్డేలో మాత్రం చేతులెత్తేసింది. సౌత్ ఆఫ్రికా ముందు 358 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ.. చివరికి నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

Also Read: Virat Kohli: సిక్స్ గేట్ ద‌గ్గ‌ర య‌శ‌స్వి అదిరిపోయే క్యాచ్‌.. కోహ్లీ ఎలా ఏడిపించాడో చూడండి

Advertisement

కొండంత లక్ష్యాన్ని కూడా సౌత్ ఆఫ్రికా 49.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్డే క్రికెట్ లో తమ మూడవ అత్యధిక రన్ ఛేజ్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది దక్షిణాఫ్రికా. దీంతో సిరీస్ ని 1-1 తో సమం చేసింది. ఇక డిసెంబర్ 6న నిర్ణయాత్మకమైన మూడవ వన్డే విశాఖపట్నం వేదికగా జరగనుంది.

 

టీమిండియా ఓటమికి కారణం అదే – ఇర్ఫాన్ పఠాన్:

Advertisement

రెండవ వన్డేలో భారత జట్టు ఓటమికి గల కారణాన్ని వెల్లడించారు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. మ్యాచ్ లో చివరి కొన్ని ఓవర్లలో బ్యాటింగ్ విఫలం కావడమే భారత జట్టుకు భారీ నష్టాన్ని కలిగించిందని ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఓ కీలక సమయంలో బ్యాటింగ్ లో ఉన్న భారత బ్యాటర్ సరిగా ఆడలేదని.. ఇన్నింగ్స్ చివర్లో రన్ రేట్ పడిపోవడంతోనే జట్టు పెద్ద స్కోరుని చేజార్చుకుందని రవీంద్ర జడేజానీ ఉద్దేశించినట్లుగా ఇర్ఫాన్ పఠాన్ తన ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ సమయంలో చివరి కొన్ని ఓవర్లే టీమిండియా ఓటమికి కారణం అయ్యాయన్నాడు. ఒకానొక దశలో 40 ఓవర్ల సమయానికి టీమ్ ఇండియా స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 284 గా ఉంది. కానీ చివరి పది ఓవర్లలో కేవలం 74 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 358 పరుగులు చేసింది. మరో 30 లేదా 40 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా జట్టు తదుపరి మ్యాచ్ కి ముందు డెత్ ఓవర్ల బ్యాటింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

 

ఇర్ఫాన్ పఠాన్ కెరీర్:

టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ చాలా విజయవంతమైనది. ఇర్ఫాన్ పఠాన్ భారత్ తరపున 29 టెస్ట్ లలో 1105 పరుగులు చేశాడు. అలాగే టెస్ట్ లలో 100 వికెట్లు పడగొట్టాడు. ఇక 120 వన్డేలలో 173 వికెట్లు, 1544 పరుగులు చేశాడు. 2017 టి-20 ప్రపంచ కప్ గెలవడంలో ఇర్ఫాన్ పఠాన్ సహకారం ఎంతో కీలకం. ఇప్పటికీ క్రికెట్ ప్రేమికులకు ఇర్ఫాన్ పఠాన్ ప్రేరణకు చిహ్నంగా ఉన్నాడు.

Also Read: Kohli-Bavuma: బవుమా ముందు కోహ్లీ కుప్పి గంతులు.. ఐసీసీ వేటు ?

అయితే ఆ మధ్య వ్యాఖ్యాతగా వ్యవహరించాడు ఇర్ఫాన్ పఠాన్. కానీ ఆస్ట్రేలియా పర్యటన తర్వాత చాలా కాలం పాటు అతన్ని ప్రసారం నుంచి దూరంగా ఉంచారు. ఇర్ఫాన్ పఠాన్ చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల టీమిండియాలోని కొంతమంది సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారనే కారణంగా అతడిని ప్రసారం నుంచి దూరంగా ఉంచారు. కానీ ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా క్రికెట్ విశ్లేషణ, తన అభిప్రాయాలను వ్యక్త పరచడం ద్వారా అభిమానులతో సన్నిహితంగా ఉన్నాడు.

Related News

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

Big Stories

Advertisement
×