Bunny vasu: ఇటీవల చిన్న సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. కథలో మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంటున్నట్లు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలు నిరూపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన బన్నీ వాసు మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. శ్రీనివాస మన్నే దర్శకత్వంలో పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మాణంలో తెరకెక్కిన ఈషా (Isha)అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఈ సినిమాని డిసెంబర్ 12వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు. నిజంగానే ఆత్మలు ఉన్నాయా అంటూ రాబోతున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు. తాజాగా సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్ వీడియో ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇక చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత కేఎల్ దామోదర్ (KL Dhamodhar)కూడా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా దామోదర్ మాట్లాడుతూ బన్నీ వాసు చిన్న సినిమాలకు ఎంతో మంచి ఆదరణ ఇస్తున్నారని తెలిపారు.
ఇటీవల కాలంలో ఒక సినిమా చేయటం ఒక ఎత్తు అయితే సినిమాని విడుదల చేయడం మరొక సవాల్ గా మారిందని తెలిపారు. అలాంటివారికి బన్నీ వాసు అండగా నిలబడి సినిమాలను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇక ఈషా సినిమా గురించి కూడా ఈయన మాట్లాడుతూ.. దాదాపు 15 సంవత్సరాల క్రితమే ఈ స్టోరీ అనుకున్నామని ఇది కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఇలాంటి ఒక మంచి సినిమాను విడుదల చేయడానికి ముందుకు వచ్చిన బన్నీ వాసు వంశీ నంది పాటిపై ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో బన్నీ వాసు మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
హార్ట్ వీక్ ఉన్నవాళ్లు రావద్దు..
ఈషా సినిమా హర్రర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాము ఇలాంటి సినిమాలను చాలా చూసాము అలాగే షూటింగ్ సమయంలో మేకప్ వేసేటప్పుడు కూడా చూసి ఉంటాం కాబట్టి చాలా వరకు భయపడము అలాంటిది నేను ఈ సినిమా చూస్తున్నప్పుడు నాలుగు సార్లు భయపడ్డానని బన్నీ వాసు తెలిపారు. హర్రర్ సినిమాలు అంటే ఇష్టపడే వారికి ఇదొక మంచి థ్రిల్లర్ సినిమాగా ఉంటుందని కచ్చితంగా టికెట్ల రేట్లు అన్ని అందుబాటులో ఉంటాయి ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని తెలిపారు. అయితే ఇదే వేదికపై బన్నీ వాసు మాట్లాడుతూ.. ఎవరైతే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు అలాగే హార్ట్ వీక్ ఉన్నవాళ్లు దయచేసి మా సినిమాకు రావద్దని కూడా హెచ్చరించారు. ఇలా హార్ట్ వీక్ ఉన్నవాళ్లు మా సినిమాకు వస్తే కచ్చితంగా భయపడతారని అందుకే అలాంటి వాళ్ళు రావద్దు అంటూ ఈయన మాట్లాడుతూ సినిమా పట్ల హైప్ పెంచేశారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ విడుదల కాబోతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
Also Read: Isha Glimpse: వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈషా గ్లింప్స్.. భయపడే వారు అస్సలు చూడొద్దు!